టాలీవుడ్ లో ఒకప్పటి హీరోలంతా విలన్ గా టర్న్ తీసుకోవడం పరిశ్రమకు కొత్త కలరింగ్ వచ్చిందనే చెప్పాలి. భాష రాని విలన్ల కన్నా తెలుగులో ఆల్రెడీ హీరోగా సక్సెస్ అయ్యి హీరోగా ఇక కష్టం అనుకున్న వారు విలన్ గా కెరియర్ లో కొత్త జోష్ తెచ్చుకుంటున్నారు. ఒకప్పుడు విలన్ గా చేసి ఆ తర్వాత హీరోగా మారగా ఇప్పుడు ఫేడవుట్ హీరోలంతా హీరోల నుండి విలన్ టర్న్ తీసుకుంటున్నారు. ఇక సినిమాలో హీరో విలన్ అంటే ఆ హీరో తాలూఖు ఇమేజ్ కూడా హెల్ప్ అవుతుంది. ఈ క్రమంలో లెజెండ్ తో బోయపాటి జగపతి బాబుని విలన్ గా టర్న్ చేశాడు. ఆ సినిమా హిట్ అవడమే కాదు జగపతి హీరోగా చేసిన దాని కన్నా విలన్ గా ఓ కొత్త ట్రెండ్ సృష్టించాడని చెప్పొచ్చు.
ఇక మరో పక్క ఆయనను ఆదర్శంగా తీసుకుని ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ కూడా విలన్ గా మారుతున్నాడు. అక్కినేని నాగ చైతన్య హీరోగా వస్తున్న యుద్ధం శరణంలో శ్రీకాంత్ విలన్ గా నటిస్తున్నాడు. ఈమధ్యనే వచ్చిన టీజర్ లో శ్రీకాంత్ విలనీ లుక్ అబ్బో సింప్లీ సూపర్బ్ అని చెప్పొచ్చు. హీరోగా కెరియర్ దాదాపు ముగిసిన శ్రీంకాంత్ సపోర్టింగ్ రోల్స్ చేసుకుంటూ కెరియర్ సాగిస్తున్నాడు. ఇక ఇప్పుడు విలన్ గా ఈ కొత్త అవతారం అతనికి ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి. ఇక యాక్షన్ కింగ్ అర్జున్ కూడా నితిన్ లై లో విలన్ గా చేశారు. విలన్ గా టాలీవుడ్ లో కొనసాగుతున్న ఈ నయా ట్రెండ్ ఎంతకాలం కొనసాగుతుందో కాని ఒకప్పటి హీరోలకు మాత్రం మళ్లీ మంచి రోజులొచ్చినట్టే.