టాలీవుడ్లో జూనియర్ ఎన్టీఆర్ – మంచు మనోజ్ ఇద్దరూ కూడా బలమైన సినీ నేపథ్యం ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన వారసులే. టాలీవుడ్లో బలమైన ఫిల్లర్ అయిన నందమూరి వంశంలో మూడో తరం హీరోగా ఎంట్రీ ఇచ్చాడు జూనియర్ ఎన్టీఆర్. అచ్చు తాతను పోలిన రూపంతో పాటు తాతలాగానే చిన్న వయస్సు నుంచే పౌరాణికం, సాంఘీకంతో పాటు ఫ్యాక్షనిజం ఇలా ఏ పాత్రలో అయినా వదిగిపోయే నైజం ఎన్టీఆర్ సొంతం.
ఇక మంచు మనోజ్ కూడా కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు రెండో వారసుడిగా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మనోజ్ మోహన్‌బాబు, విష్ణులా కాకుండా తనకంటూ సపరేజ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా స్పందిస్తూ ఉంటాడు. ముఖ్యంగా ఆడపిల్లలపై జరిగే అన్యాయాలకు వ్యతిరేకంగా ఎప్పటికప్పుడు గళం ఎత్తడంతో పాటు మనోజ్ స్వయంగా బాధితుల ఇళ్లకు వెళ్లి వారి కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెపుతూ ఉంటాడు.
ఇక సినిమా జీవితం బయట వీరు మంచి స్నేహితులు. తారక్ యమదొంగ సినిమాలో మోహన్‌బాబు కూడా మంచి పాత్రలో నటించారు. ఇక మనోజ్ – ఎన్టీఆర్ మధ్య ఐదు కామన్ పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్స్ చాలా ఇంట్రస్టింగ్‌గా ఉంటాయి.
1) ఇద్దరి బర్త్ డే ఒకరోజే :
జూనియర్ ఎన్టీఆర్, మంచు మనోజ్ ఇద్దరి బర్త్ డే ఒక రోజే.. వీరిద్దరు 1983 మే 20న జన్మించారు. అయితే మనోజ్ కంటే ఎన్టీఆర్ కొన్ని గంటల ముందు మాత్రమే జన్మించాడు. ఇక వీరిద్దరు తమ బర్త్ డే సందర్భంగా ఒకరికొకరు బర్త్ డే విషెస్ చెప్పుకుంటూ ఉంటారు.
2) ఇద్దరూ బాలనటులుగా ఎంట్రీ ఇచ్చింది రామారావు సినిమాల్లోనే..
జూనియర్ ఎన్టీఆర్ బాల నటుడిగా తాత నటించిన బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత బాల రామాయణం సినిమాతో బాలహీరో అయ్యాడు. ఇక పెద్దయ్యాన నిన్ను చూడాలని సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మనోజ్ రామారావు నటించిన మేజర్ చంద్రకాంత్ సినిమాతో బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత హీరో అయ్యాడు.
3) ఇద్దరి తండ్రులు రాజ్యసభ MP లే..
Jr. NTR తండ్రి హరికృష్ణ , మంచు మనోజ్ తండ్రి మోహన్ బాబు ఇద్దరూ MPలుగా రాజ్యసభలో అడుగుపెట్టిన వారే. వీరిద్దరు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి రాజ్యసభ సభ్యులు అయ్యారు. ఎన్టీఆర్ మోహన్‌బాబును స్వయంగా రాజ్యసభ సభ్యుడు అయ్యారు. ఇక 2007లో హరికృష్ణను చంద్రబాబు హయాంలో రాజ్యసభకు పంపారు.
4) ఇద్దరి భార్యల పేర్లు ప్రణతినే…
Jr. NTR భార్య పేరు లక్ష్మీ ప్రణతి కాగా, మంచు మనోజ్ భార్య పేరు ప్రణతీ. ఎన్టీఆర్ తన బంధువు.. మేనకోడలు అయిన ప్రణతిని పెళ్లి చేసుకున్నారు. వీరిది చంద్రబాబు కుదిర్చిన వివాహం. అయితే మనోజ్ – ప్రణతిరెడ్డిది ప్రేమ వివాహం. అయితే ఇటీవలే మనోజ్ విడాకులు తీసుకుని.. ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నాడు.
5) రెండవ భార్య సంతానం.
Jr. NTR హరికృష్ణ రెండవ భార్య సంతానం కాగా , మంచు మనోజ్ మోహన్ బాబు రెండవ భార్య సంతానం. అయితే హరికృష్ణ మొదటి భార్య ఉండగానే.. తమ కుటుంబంలో పిల్లలకు మ్యూజిక్ నేర్పుందుకు వచ్చిన షాలినిని రెండో భార్యగా స్వీకరించారు. అయితే మోహన్‌బాబు పెద్ద భార్య విద్యాదేవి ఆత్మహత్య చేసుకున్నాక ఆమె సోదరి నిర్మలాదేవీని రెండో పెళ్లి చేసుకున్నాడు.