Moviesబుకింగ్స్‌తోనే హైద‌రాబాద్ సిటీలో కోట్లు కొల్ల‌గొట్టిన RRR.. వామ్మో ఇదేం ఊచ‌కోత‌రా...

బుకింగ్స్‌తోనే హైద‌రాబాద్ సిటీలో కోట్లు కొల్ల‌గొట్టిన RRR.. వామ్మో ఇదేం ఊచ‌కోత‌రా సామీ..!

ఇండియ‌న్ సినిమా జ‌నాలు అంద‌రూ ఎప్పుడెప్పుడా అని ఎంతో ఎగ్జైట్మెంట్‌తో వెయిట్ చేస్తోన్న సినిమా త్రిబుల్ ఆర్‌. మూడున్న‌ర సంవ‌త్స‌రాలుగా ఎంతో మంది సినీ ల‌వ‌ర్స్‌ను ఊరించి ఊరించి వ‌స్తోన్న ఈ సినిమా ఎట్ట‌కేల‌కు ఈ నెల 25న థియేట‌ర్ల‌లోకి దిగుతోంది. సినిమా ఎప్పుడు వ‌స్తుందా ? ఈ రెండు రోజులు కూడా ఎలా గ‌డుస్తాయా ? అని చాలా మంది మినిట్ టు మినిట్ లెక్క పెట్టుకుంటోన్న ప‌రిస్థితి.

ఇక ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్‌లో ఓ రేంజ్‌లో జ‌రుగుతున్నాయి. ఏపీ, తెలంగాణ‌, బెంగ‌ళూరు, ముంబై, ఢిల్లీ.. అటు అమెరికా ఎక్క‌డ చూసినా కూడా అడ్వాన్స్ బుకింగ్‌ల‌తోనే త్రిబుల్ ఆర్‌కు కోట్లాది రూపాయ‌లు వ‌చ్చి ప‌డుతున్నాయి. ఓవ‌ర్సీస్‌లో ఇప్ప‌టికే 2 మిలియ‌న్ డాల‌ర్ల మార్క్‌ను దాటేసిన త్రిబుల్ రిలీజ్ టైంకు బాహుబ‌లి ది కంక్లూజ‌న్ రికార్డు అయిన 2.45 మిలియ‌న్ డాల‌ర్ల రికార్డును కూడా బ్రేక్ చేస్తుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి.

ఇక గ్రేట‌ర్ హైద‌రాబాద్ సిటీలో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్‌లు చూస్తుంటే క‌ళ్లు జిగేల్ మంటున్నాయి. మ‌తులు పోతున్నాయి. అస‌లు ఈ సినిమా ఒక్క హిందీ వెర్ష‌న్ మాత్ర‌మే మ‌న దేశంలో ఏకంగా 3400 స్క్రీన్ల‌లో రిలీజ్ అవుతోంది. ఈ స్థాయిలో రిలీజ్ అవుతోన్న అతి పెద్ద భార‌తీయ సినిమాగా కూడా రికార్డు త్రిబుల్ ఆర్ ఖాతాలో ప‌డుతోంది. ఇక హైద‌రాబాద్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు బుకింగ్స్ ద్వారానే రు 2.5 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టింది.

రిలీజ్‌కు మ‌రో రెండు రోజుల టైం ఉంది.. ఈ రెండు రోజుల్లో మ‌రో కోటి రూపాయ‌లు వ‌స్తాయ‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెపుతున్నాయి. అస‌లు ఇంకా కొన్ని స్క్రీన్ల బుకింగ్‌లు తెర‌వ‌లేదు. అవి కూడా తెరిస్తే వ‌సూళ్ల సునామీయే క్రియేట్ కానుంది. ఇక రిలీజ్ రోజు తెల్ల‌వారు ఝామున వేసే ఆరు బెనిఫిట్ షోల ఆదాయ‌మే కోటికి కాస్త అటూ ఇటూగా ఉంటుంద‌ని టాక్ ?

ఇక ఫ‌స్ట్ డే వ‌సూళ్లే రు. 200 కోట్లు ఉంటాయ‌ని కూడా భారీ అంచ‌నాలు ఉన్నాయి. అలియా భట్, ఒలివియా మోరిస్ లు హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాలో శ్రియ శరణ్, అజయ్ దేవగణ్, సముద్ర ఖని, రాహుల్ రామకృష్ణ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news