తెలుగు సినిమా పరిశ్రమలో ఒకప్పటి స్టార్ హీరో శోభన్‌బాబు, మెగాస్టార్ చిరంజీవి ఇద్దరూ కూడా స్వయంకృషితో స్టార్ హీరోలుగా ఎదిగిన వారే. ఇద్దరికి ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేదు. చిరంజీవికి ఏదో తన మామ అల్లూరి రామలింగయ్య లాంటి వారు అయినా చెప్పుకోవడానికి ఇండస్ట్రీలో ఓ పిల్లర్‌లా ఉన్నారు. శోభన్‌బాబుకు ఎవ్వరూ లేరు. 1970 – 80వ దశకంలో శోభన్‌బాబు ఆంధ్రా అందగాడిగా ప్రసిద్ధి చెందారు. ఆయనకు లేడీ ఫాలోయింగ్ బాగా ఎక్కువ. ఇద్దరు హీరోయిన్ల మధ్యలో నలిగిపోయే ముద్దుల మొగుడు క్యారెక్టర్లలో ఆయన ఎక్కువుగా నటించేవారు. ఆ తర్వాత శోభన్‌భాబు వారసత్వాన్ని జగపతిబాబు తీసుకున్నారు. జగపతిబాబు కూడా ఇద్దరు లవర్స్ లేదా.. భార్య, ప్రియురాలు మధ్యలో నలిగిపోయే పాత్రలో కనిపించాడు.
ఇక చిరంజీవి అప్పట్లో బ్రేక్ డ్యాన్సుల హీరో.. డ్యాన్సుల్లో తన శరీరాన్ని మెలికలు తిప్పుతూ బాడీలో స్ప్రింగ్‌లు పెట్టుకున్నాడా ? అన్నట్టుగా స్టెప్పులు వేసి కుర్రకారు మతులు పోగొట్టాడు. ఇక చిరంజీవి స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లాలోని మొగల్తూరు. మొగల్తూరులో పుట్టిన చిరు పక్కనే ఉన్న పాలకొల్లు అమ్మాయి సురేఖను వివాహమాడారు. ఈ రోజు చిరు వేసిన విత్తనమే మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి ఏకంగా 12 మంది హీరోలను అందించింది.
ఇక శోభన్‌బాబు, చిరంజీవి ఇద్దరూ కూడా ఒకే టైటిల్‌తో వచ్చిన సినిమాల్లో నటించారు. ఆ టైటిలే జేబుదొంగ. శోభన్‌బాబు హీరోగా జేబుదొంగ సినిమాను 1978లో తెరకెక్కించారు. అలనాటి మేటి నటి మంజుల శోభన్‌బాబు పక్కన హీరోయిన్గా నటించింది. మంజుల కుమార్తెలే ప్రీతి, రుక్మిని, వనితా విజయ్‌కుమార్. సమతా ఆర్ట్స్ యోగేంద్ర నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాకు విక్టరీ మధుసూదన్ రావు దర్శకత్వం వహించారు. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. కమర్షియల్‌గా బాగా సక్సెస్ అయ్యింది.
ఇక చిరంజీవి హీరోగా కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో 1987లో జేబుదొంగ టైటిల్‌తోనే మరో సినిమా వచ్చింది. అర్జున రాజు, రామలింగరాజు నిర్మాణంలో ఈ సినిమా వచ్చింది. ఈ సినిమాలో రాధ, భానుప్రియ హీరోయిన్లుగా నటించారు. చిరంజీవి హీరోగా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. అలా ఒకే టైటిల్‌తో వచ్చిన ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాయి.