పవన్ కళ్యాణ్‌కు తెలుగు గడ్డపై ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఖుషీ తర్వాత గబ్బర్‌సింగ్ సినిమా వరకు దాదాపు 11 ఏళ్లు పవన్ రేంజ్‌కు తగ్గ హిట్ అయితే పడలేదు. మధ్యలో జల్సా లాంటి ఓ మోస్తరు సినిమాలు వచ్చినా పవన్ ఫ్యాన్స్‌కు ఖుషీ తర్వాత ఆ రేంజ్లో విందు భోజనం గబ్బర్‌సింగ్ ఇచ్చింది. ఈ 11 ఏళ్లలో ఒక్క హిట్టూ లేకపోయినా కూడా పవన్ ఇమేజ్ ఇసుమంతైనా తగ్గలేదు సరికదా ? మరింత పెరిగింది. అత్తారింటికి దారేది సూపర్ హిట్.
అక్కడ నుంచి పవన్ మళ్లీ ట్రాక్ తప్పేశాడు. అసలు పవన్ ఎంచుకునే కథలు సగటు సినీ అభిమానికి కాదు.. ఆయన అండే పడిచచ్చే వీరాభిమానులకే నచ్చడం లేదు. సర్దార్ గబ్బర్‌సింగ్ ఎందుకు చేశాడో ? తెలీదు. ఇక తమిళంలో తెరకెక్కి తెలుగులో వీరుడొక్కడే పేరుతో వచ్చిన అజిత్ సినిమాను కాటమరాయుడుగా రీమేక్ చేస్తే డిజాస్టర్. అసలు కాటమరాయుడు సినిమా ఎందుకు చేశాడు ? పవన్ రేంజ్‌కు ఈ రీమేక్‌లు అవసరమా ? అని ఫ్యాన్స్ మొత్తుకున్నారు.
ఇక అజ్ఞాతవాసి డైరెక్టు కథ కాదు. ఫ్రెంచ్ సినిమా లార్గోవిచ్కు రీమేక్ అన్నది తెలిసిపోయింది. అది కూడా డిజాస్టర్. ఇక అజ్ఞాతవాసి తర్వాత మూడేళ్ల లాంగ్ గ్యాప్ తీసుకుని వకీల్‌సాబ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇది కూడా బాలీవుడ్లో వచ్చిన పింక్ సినిమాకు రీమేక్. ఈ సినిమా కూడా ఫక్తు కమర్షియల్ హంగులకు దూరంగా ఉంది. సినిమా బాగున్నా పవన్ రేంజ్‌కు తగ్గ హిట్ కాదు. పవన్ టైప్ మసాలాలు కూడా లేవు.
ఇక తాజాగా వచ్చిన భీమ్లానాయక్ సైతం మల్లూవుడ్ హిట్ సినిమాకు రీమేకే. వరుస రీమేక్‌లతో పవన్ మార్కెట్ పెరగడం లేదు సరికదా ? ఫ్యాన్స్‌లోనూ పవన్ సినిమా చూడాలన్న ఆతృత తగ్గిపోతోంది. ఇటు ఇప్పుడున్న యూట్యూబ్ యుగంలో ఒరిజినల్ వెర్షన్ సినిమా చూసేసిన వాళ్లు ఇప్పుడు పవన్ ఇక్కడ రీమేక్ చేసినా ఆ సినిమా చూసేందుకు ఇష్టపడడం లేదు.
ఈ గోల ఇలా ఉండగానే కోలీవుడ్ సినిమా వినోదయ సీతం సినిమాను రీమేక్ చేస్తారంటూ వార్తలు రావడంతో పవన్ ఫ్యాన్స్ డిజప్పాయింట్ అయిపోతున్నారు. ఆ సినిమా కూడా కమర్షియల్ హంగులకు దూరం. ఈ వార్త ఇలా ఉండగానే పవన్ ఫ్యాన్స్ గుండెలు పగిలే మరో రీమేక్ వార్త వచ్చింది. కోలీవుడ్‌లో అట్లీ దర్శకత్వంలో విజయ్ హీరోగా వచ్చి తెరి సినిమా గుర్తుండే ఉంటుంది. ఇది తెలుగులో పోలీసోడు పేరుతో రిలీజ్ అయ్యింది.
ఈ సినిమాలో అంత కమర్షియల్ హంగులూ ఉండవు. పోనీ అంతదమ్మున్న సబ్జెక్ట్ కాదు. తెలుగులో కూడా దీనిని చాలా మంది టీవీల్లో చూసేశారు. ఇప్పుడు ఈ సినిమాను మళ్లీ పవన్ రీమేక్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. మా టీవీ ఛానెల్స్‌లో పోలీసోడు అరిగిపోయిన క్యాసెట్లా ఎన్నో సార్లు రిపీటెడ్‌గా రావడంతో అందరూ చూసేశారు. మరి ఇప్పుడు అందరికి తెలిసిన ఈ కథతో పవన్ ఎందుకు సినిమా చేస్తున్నాడో ? ఏంటో ఫ్యాన్స్‌కే అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు.