బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమా త్రిబుల్ ఆర్ ఈ నెల 25న ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ థియేటర్లలో విడుదల కానుంది. సౌత్‌లో అన్ని భాషల్లోనూ భారీ ఎత్తున రిలీజ్ అవుతోన్న ఈ సినిమాను నార్త్‌లో కూడా అంతే స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 14 భాషల్లో త్రిబుల్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఇక 25న రిలీజ్ అవుతోన్న ఈ సినిమాకు బాహుబలి ది కంక్లూజన్ తరహాలో స్పెషల్ ప్రీమియర్లు ప్లాన్ చేస్తారని ముందునుంచి వార్తలు వచ్చాయి.
గతంలో బాహుబలి 2 సినిమాకు తెలంగాణలో కూకట్పల్లి, మూసాపేట ప్రాంతాల్లో కొన్ని థియేటర్లలో ముందు రోజు సెకండ్ షో నుంచే ప్రీమియర్లు వేశారు. ఇటు ఏపీలో కూడా అర్ధరాత్రి నుంచే ప్రీమియర్లు మొదలు పెట్టేశారు. ఇక త్రిబుల్ విషయంలో ప్రీమియర్లపై రాజమౌళిని ముందుగానే ప్రశ్నించారు. అయితే అది డిస్ట్రిబ్యూటర్ల నిర్ణయం అని ఆయన తేల్చేశారు. అయితే నైజాంలో ఈ సినిమాను పంపిణీ చేస్తోన్న దిల్ రాజు ఫెయిడ్ ప్రీమియర్ల విషయంలో డేరింగ్ స్టెప్ వేశారు.
24వ తేదీ అర్ధరాత్రి దాటాక.. 25వ తేదీ తెల్లవారు ఝామున 4 గంటల నుంచే ఈ ప్రీమియర్లు స్టార్ట్ కానున్నాయి. ఇన్నమూరి గోపీచంద్ అనే మరో డిస్ట్రిబ్యూటర్ ఈ స్పెషల్ షోల హక్కులు సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. మార్చి 25వ తేదీ తెల్లవారు ఝామున కూకట్పల్లి భ్రమరాంబ, మల్లిఖార్జున, అర్జున్ థియేటర్లలో ఈ షోలు వేస్తున్నారు. ఈ షోల టిక్కెట్ ఒక్కోటి రు. 5 వేలుగా డిసైడ్ చేశారు.
అలాగే మూసాపేట శ్రీరాములు థియేటర్‌తో పాటు బోరబండ విజేత థియేటర్లో కూడా ఈ స్పెషల్ ప్రీమియర్లు వేస్తున్నారట. ప్రీమియర్లు వేయడం ఫ్యాన్స్‌కు గుడ్ న్యూసే అయినా కూడా టిక్కెట్ రేటు ఏకంగా రు. 5 వేలు ఉండడంతో ఫ్యాన్స్ రేటు చాలా ఎక్కువ అని నిరాశతోనే ఉన్నారు. ఈ స్పెషల్ ప్రీమియర్లతోనే ప్రపంచ వ్యాప్తంగా త్రిబుల్ ఆర్ ప్రీమియర్ల హంగామా స్టార్ట్ అవుతుంది. ఇటు ఏపీలో అర్ధరాత్రి దాటాక తెల్లవారజు ఝామున 3-4 గంటల నుంచే పలు నగరాల్లో ప్రీమియర్లు ప్లాన్ చేస్తున్నారు.