Moviesత‌గ్గ‌వ‌య్యా తగ్గు..లేకపోతే నీకు అది తప్పదు..?

త‌గ్గ‌వ‌య్యా తగ్గు..లేకపోతే నీకు అది తప్పదు..?

ఈ రోజుల్లో ఎన్ని కోట్లు ఖర్చు చేసి సినిమా తీసిన దానిలో ఫ్యాన్స్ కు నచ్చే ఎలిమెంట్స్ లేకపోతే..అభిమానులు అలాంటి సినిమాని లైక్ చేయడం లేదు. అది ఎంత పెద్ద స్టార్ హీరో అయినా.. సరే..నచ్చని సినిమా చేస్తే బాక్స్ ఆఫిస్ వద్ద డిజాస్టర్ టాక్ తెప్పిస్తున్నరు. దానికి బెస్ట్ ఉదాహరణ..రీసెంట్ గా రిలీజ్ అయిన “రాధేశ్యామ్. అబ్బో..ఈ సినిమా రిలీజ్ అయ్యే ముందు ఉన్న హడావుడి చూస్తే ఏదో పండగలా అనిపించింది. ఫ్యాన్స్ బాగా ఎక్స్ పెక్ట్ చేసి..ఎంతో ఆశగా ధియెటర్స్ లోకి వెళ్ళారు.

కానీ సీన్ కట్ చేస్తే..ప్రభాస్ ఫ్యాన్సే కొంత మంది “ఏంటి డార్లింగ్ ఇలాంటి సినిమా ను ఒకే చేశావ్ అంటూ” నిరాశ పడితే మరికొందరు మీడియా ముఖం గానే “నీకు దండం పెడతాం డార్లింగ్ ఇలాంటి చెత్త సినిమాలు తీయ్యకు” అంటూ రీవ్యూ లో చెప్పుకొచ్చారు. నెట్టింట కూడా ఈ సినిమాలో నటించిన హీరో ప్రభాస్ ని..డైరెక్టర్ రాధకృష్ణని విపరీతంగా ట్రోల్ చేశారు.

కాగా..రెబల్ ఫ్యన్స్ కొంతమ్మది ప్రభాస్ కు సోషల్ మీడియా వేదికగా కొన్ని సజీషన్స్ ఇస్తున్నారు. “నువ్వు వందల కోట్లు పెట్టి వేరే దేశాలకి వెళ్లి షూటింగ్ చేయనవసరం లేదు. సినిమా బడ్జెట్ ని తగ్గించుకుని..కధకి వాల్యూ ఉండేటట్లు..ఆ కధ నీకు సెట్ అయ్యేటట్లు చూసుకో . ఫస్ట్ భారీ బడ్జెట్ సినిమాలు చేయకు ..లో బడ్జెట్ సినిమాలు చూస్ చేసుకో. ఇప్పుడు నువ్వు ఉన్న పోజీషన్ కి రెండు మూడు చిన్న సినిమాలు హిట్ కొడితేనే..ఫాంలోకి రాగలవు..సలార్ కూడా దొబ్బింది అంటే హ్యాట్రిక్ ఫ్లాప్ కొడతావు..జర జాగ్రత్తా” అంటూ సలహాలు ఇస్తున్నారు. మరి నెటిజన్స్ సలహాలను ప్రభాస్ వింటాడో లేదో..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news