MoviesRRR అమెరికాలో నెవ్వర్ బిఫోర్... వామ్మో ఏంట్రా బాబు ఈ రికార్డులు..!

RRR అమెరికాలో నెవ్వర్ బిఫోర్… వామ్మో ఏంట్రా బాబు ఈ రికార్డులు..!

టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ త్రిబుల్ ఆర్ రిలీజ్‌కు మ‌రో 8 రోజుల టైం మాత్ర‌మే మిగిలి ఉంది. ఇప్ప‌టికే త్రిబుల్ ఆర్ టీం ప్ర‌చారం హోరెత్తిస్తోంది. ఇక ముగ్గురు R లు కలిసి మీడియాతో ఇంటరాక్ట్ అవుతూ మూవీపై నేష‌న‌ల్ వైడ్‌గా హైప్ మామూలుగా పెంచ‌డం లేదు. ఇక 14 భాష‌ల్లో రిలీజ్ అవుతోన్న ఈ సినిమా ప్రి టిక్కెట్ సేల్ మామూలుగా జ‌ర‌గ‌డం లేదు. తొలి రోజు రికార్డుల‌తో పాటు ఫ‌స్ట్ వీకెండ్ రికార్డుల దుమ్ము కూడా రేప‌నుంది.

ఈ అంచ‌నాల‌ను అందుకునేలా త్రిబుల్ ఆర్‌కు టిక్కెట్ల సేల్ మామూలుగా జ‌ర‌గడం లేదు. ఇప్ప‌టికే ఓవ‌ర్సీస్‌లో అయితే ఏకంగా 1.5 మిలియ‌న్ డాల‌ర్లు కేవ‌లం అడ్వాన్స్ బుకింగ్‌ల ద్వారానే వ‌సూళ్లు అయ్యాయి. రిలీజ్‌కు మ‌రో 5 రోజుల టైం ఉండ‌డంతో ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇక అమెరికాలో ఈ సినిమా నెవ్వ‌ర్ బిఫోర్ రేంజ్‌లో రిలీజ్‌కు ముందే రికార్డుల మోత మోగిస్తోంది.

ఈ సినిమా అక్క‌డ ఏ తెలుగు సినిమా రిలీజ్ కాని విధంగా ఏకంగా 1150 లొకేష‌న్ల‌లో రిలీజ్ అవుతోంది. ఇప్ప‌టికే థియేట‌ర్ల లిస్ట్ కూడా దాదాపు క‌న్‌ఫార్మ్ చేశారు. ఈ సినిమా ఓవ‌ర్సీస్ రైట్స్‌ను రు. 65 కోట్ల‌కు అమ్మారు. ఇక 1150 లొకేష‌న్ల‌కు సంబంధించి థియేట‌ర్ల లిస్ట్ కూడా రిలీజ్ అయ్యింది. ప్ర‌పంచ వ్యాప్తంగా త్రిబుల్ ఆర్ మార్చి 25 నుంచి రిలీజ్ అవుతుంటే ఓవ‌ర్సీస్‌లో మాత్రం 24నే ప్రీమియ‌ర్లు వేస్తున్నారు.

ఒక్క అమెరికాలో మాత్ర‌మే కాదు.. ఇటు యూర‌ప్‌లోనూ ఈ సినిమా భారీ స్థాయిలో విడుద‌ల అవుతోంది. యూర‌ప్‌లో యూకేతో పాటు మ‌రో 30 దేశాల్లో భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. ఫోర్ సీజ‌న్స్ క్రియేష‌న్స్ వాళ్లు ఈ భారీ రిలీజ్‌లో పెద్ద ఎత్తున ప్లానింగ్ చేస్తున్నారు. పోలండ్‌, స్వీడ‌న్‌, ఫిన్లాండ్‌తో పాటు కొన్ని దేశాల్లో ఈ సినిమా రికార్డు స్థాయి స్క్రీన్ల‌లో రిలీజ్ అవుతోంది. విచిత్రం ఏంటంటే యూర‌ప్‌లో కూడా అడ్వాన్స్ బుకింగ్‌లు మామూలుగా లేవు.

రాజ‌మౌళి సినిమాలు విదేశాల్లో కూడా భారీ ఎత్తున వ‌సూళ్లు రాబ‌ట్టాయి. అమెరికా, చైనా, జ‌పాన్ లాంటి చోట్ల వ‌సూళ్ల మోత మోగించాయి. ర‌ష్యాలోనూ బాహుబ‌లి సంచ‌ల‌నాలు క్రియేట్ చేసింది. అందుకే ఈ సారి ఆ మార్కెట్‌ను క్యాష్ చేసుకునే విష‌యంలో రాజ‌మౌళి ఎక్క‌డా రాజీప‌డ‌డం లేదు. ఇక ఏపీలో త్రిబుల్ ఆర్ యూనిట్ రిక్వెస్ట్ మేర‌కు ప్ర‌తి టిక్కెట్‌పై రు. 100 పెంచుకోవ‌చ్చని ప్ర‌భుత్వం చెప్ప‌డం సినిమాకు పెద్ద ఊర‌ట‌.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news