సినిమా ఇండస్ట్రీ అంటేనే బిజినెస్. ఒకరి కోసం.. మరొకరు ఎట్టి పరిస్థితిలోనూ త్యాగం చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే.. ఎవరి ఇమేజ్ వారిది… ఎవరి స్టార్ డమ్ వారిది! ఎవరూ.. కూడా మరొకరి కోసం ఆలోచించే పరిస్థితి మచ్చుకు కూడా కనిపించదు. ఇలాంటి సినీ ఇండస్ట్రీలో అన్నగారు.. ఎన్టీఆర్.. త్యాగం చేశారంటే.. నమ్మడం కొంత కష్టమే. అయినప్పటికీ.. ఇది నిజం! ఒక హీరో.. కోసం.. మరో హీరో త్యాగం చేయడం.. బహుశ.. తెలుగు సినీ రంగంలో ఇదే మొదలు.. ఇదే ఆఖరు కూడా! అందుకే .. ఈ విషయం తెలుగు చలన చిత్రరంగంలో చిరస్థాయిగా నిలిచిపోయింది.
ఏం జరిగిందంటే.. అది 1973-74 మధ్య కాలం. చారిత్రక పురుషుల నేపథ్యాలతో సినిమాలు తీస్తున్న కాలం! ఈ క్రమంలో సూపర్ స్టార్ నట శేఖర కృష్ణ.. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్రను ఇతి వృత్తంగా తీసుకుని సినిమా రూపొందించారు. ఇది భారీ ఎత్తున సక్సెస్ అయింది. ఈ సినిమా అప్పట్లో ఓసంచలనం. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో శత దినోత్సవాలతో పాటు.. పలు థియేటర్లలో 365 రోజుల పాటు ఆడి.. సరికొత్త రికార్డు లు సృష్టించింది. అప్పటి వరకు ఉన్న సినిమా రికార్డుల్లో సరికొత్త ఒరవడికి కూడా నాంది పలికింది. ఈ సినిమాలో కలిసి నటించిన విజయనిర్మల, కృష్ణలు వివాహం కూడా చేసుకున్నారు.
అయితే.. రెండేళ్ల తర్వాత.. ఇదే సబ్జెక్ట్‌తో దర్శకుడు దుక్కిపాటి మధుసూదనరావు ( విక్టరీ మధుసూదనరావు) .. అన్నగారిని కలిశారు. మనం కూడా అల్లూరి సీతారామరాజు సినిమా చేద్దాం అని చెప్పారు. వాస్తవానికి అప్పటికే అల్లూరి జీవిత విశేషాలతో సినిమా తీయాలని ఎన్టీఆర్ అనుకున్నారు. కానీ.. తబిజీ షెడ్యూల్ కారణంగా అది సాకారం కాలేదు. ఈలోగా కృష్ణ తీసేశాడు. అయినప్పటికీ.. మనం తీద్దాం.. అంటూ.. స్క్రిప్టు రెడీ చేసుకుని.. మధుసూదన రావు.. అన్నగారిని కలిసారు. మనసులో అన్నగారికి కూడా నటించాలనే ఉంది. ఎందుకంటే.. స్వాతంత్య్రోద్యమంలో అల్లూరిని మించిన తెలుగు నాయకుడు మరొకరు లేరు. అందుకే.. అన్నగారిలోనూ.. ఈ పాత్రపై ఒకవిధమైన ప్రేమ ఉంది.
కానీ, అప్పటికే కృష్ణ నటించడం.. భారీ స్థాయిలో హిట్ కావడంతో అన్నగారు.. మధుసూదన రావు చేసిన ప్రతిపాదనకు నో.. చెప్పారు. అంతేకాదు.. మన తెలుగు నటుడికి పోటీగా మేం చేయడమా..! అని ప్రశ్నించారు. అప్పటి నుంచి అన్నగారు.. ఆ పాత్రకు దూరంగానే ఉన్నారు. ఎంతో మంది ఈ సినిమా కథను కొద్దిగా మార్చి తీద్దామని ప్రతిపాదించినా.. చారిత్రక విషయాలను వక్రీకరించడాన్ని అన్నగారు ఒప్పుకొనే వారు. ఇలా.. కృష్ణ కోసం.. అన్నగారు అల్లూరి పాత్రను త్యాగం చేశారు.
అయితే.. అన్నగారి మనసులో మాత్రం.. అల్లూరి పాత్రపై ప్రేమ అలానే ఉంది. ఇది తెలుసుకున్న దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు.. అవకాశం కోసం వేచి చూసి.. మోహన్‌బాబు, అన్నగారి తో తీసిన మేజర్ చంద్రకాంత్ మూవీలో ఒక పాటను పెట్టి.. అల్లూరి పాత్రను అన్నగారితో వేయించారు. అప్పటికి అన్నగారి కోరిక తీరిందట!! ఇదీ సంగతి!!!