Newsప్రియుడి కోసం ఆ యువతి ఏం చేసిందో తెలుసా?

ప్రియుడి కోసం ఆ యువతి ఏం చేసిందో తెలుసా?

A teenage girl has done something weird in search of her boyfriend. The girl stripped her clothes and was standing without clothes to get her boyfriend back. The road siders have recorded this incident and the video is going viral in social media.

ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన బాయ్‌ఫ్రెండ్ కోసం ఓ ప్రేయసి ఎవరూ చేయని పని చేసి వార్తల్లో నిలిచింది. తాను ఎంతో ఘాడంగా ప్రేమించి ప్రియుడి జాడకోసం ఆమె చేసిన అన్వేషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమారంలా మారింది. ఇంతకీ అమ్మడు ఏం చేసిందనేగా మీ డౌట్.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అర్జెంటీనాలోని ఎల్డోరాడో నగంలోని ఓ రోడ్డు పక్కన ఉన్న బెంచిపై 27 ఏళ్ళ యువతి నగ్నంగా కూర్చుంది. అటువైపు వెళుతున్న వాహనదారులు ఆమెను చూసి నివ్వెరపోయారు. అసలు విషయం ఏమిటో తెలుసుకుందామని ఆమె వద్దకు వెళ్లిన వారు నోళ్లు వెల్లబెట్టారు.

ఫాబియన్ సోఫా అనే యువకుడిని తాను ప్రేమించానని, అతడితో జీవితం పంచుకోవాలని అనుకున్నానంటూ చెప్పింది ఆ యువతి. అయితే అతడు గత కొద్ది రోజులుగా కనబడటం లేదని వాపోయింది సదరు యువతి. అతగాడి కోసం అన్నీ చోట్లా వెతికివేసారిన ఆమె ఈ విధంగా తన ప్రియుడి జాడ తెలుసుకునేందుకు నగ్నంగా రోడ్డు పక్కన ఉన్న బెంచ్‌పై కూర్చుంది. అటువైపుగా వచ్చివెళ్లే వారు అందరూ ఆమెకు సర్దిచెప్పినా ఆమె వినకపోవడంతో చేసేది ఏమి లేక స్థానికులు పోలీసులకు పని చెప్పారు. వారు వచ్చి అమ్మడిని తమతో పాటు తీసుకెళ్లి ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ఇంతలా ప్రేమించే ప్రేయసిని వదిలేసిన ప్రియుడి జాడ మాత్రం దొరకలేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news