Moviesబాల‌య్య‌కు ఓ రేటు... చిరుకు మ‌రో రేటా... శృతిహాస‌న్ భ‌లే షాక్...

బాల‌య్య‌కు ఓ రేటు… చిరుకు మ‌రో రేటా… శృతిహాస‌న్ భ‌లే షాక్ ఇచ్చిందే…!

మెగాస్టార్ చిరంజీవి – బాబి కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది. చిరు 154వ సినిమాగా తెర‌కెక్కే ఈ సినిమాకు వాల్తేరు వీర‌య్య అన్న టైటిల్ అనుకుంటున్న‌ట్టు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ సినిమాలో చిరు ప‌క్క‌న హీరోయిన్‌గా శృతీహాస‌న్‌ను ఎంపిక చేశారు. ఉమెన్స్ డే సంద‌ర్భంగా చిరు స్వ‌యంగా శృతికి విషెస్ తెల‌ప‌డంతో పాటు ఆమెకు బొకే ఇచ్చి స్వాగ‌తిస్తోన్న ఫొటో సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు.

ఫామ్‌లో ఉండ‌గానే తెలుగును కాద‌నుకుని ప్రేమ‌ల్లో మునిగి తేలుతూ బాలీవుడ్‌కు చెక్కేసింది శృతీహాస‌న్‌. లేక‌పోతే ఈ రోజు ఆమె తెలుగులో తిరుగులేని స్టార్ హీరోయిన్‌గా కంటిన్యూ అవుతూ ఉండేది. గ‌తేడాది ర‌వితేజ‌తో ఆమె చేసిన క్రాక్ సినిమా హిట్ అవ్వ‌డంతో ఎట్ట‌కేల‌కు శృతి ఫామ్‌లోకి వ‌చ్చింది. అయితే ఇప్పుడు ఆమె సీనియ‌ర్ హీరోల‌కే బెస్ట్ ఆప్ష‌న్‌గా మారింది. చిరంజీవి, బాల‌య్య‌, నాగార్జు, వెంక‌టేష్ లాంటి సీనియ‌ర్ల‌కు హీరోయిన్లు దొర‌క‌డం క‌ష్ట‌మైపోయింది.

ఈ క్ర‌మంలోనే మూడున్న‌ర ప‌దుల వ‌య‌స్సు ఉన్న శృతీనే వీళ్లు ఏరీకోరి మ‌రీ సెల‌క్ట్ చేసుకుంటున్నారు. శృతీకేమో ఛాన్సులు కావాలి.. సీనియ‌ర్ హీరోల‌కు హీరోయిన్ కావాలి. అందుకే ఆమెకు ల‌క్కీ ఛాన్స్ త‌గిలిన‌ట్టు అవుతోంది. ఇటు బాల‌య్య – మ‌లినేని సినిమాలో న‌టిస్తోన్న శృతి.. అదే టైంలో చిరు – బాబి సినిమా కూడా చేస్తోంది. ఒకే టైంలో రెండు సినిమాల్లో ఆమె న‌టిస్తోన్న రెమ్యున‌రేష‌న్ విష‌యంలో మాత్రం రెండు సినిమాల‌కు తేడా ఉంద‌ని తెలుస్తోంది.

చిరు సినిమా కోసం రూ.2 కోట్ల పారితోషికం అందుకుంటోన్న శృతి… అదే బాల‌య్య సినిమాకు రు 1.5 కోట్లు మాత్ర‌మే తీసుకుంటోంద‌ట‌. ఇద్ద‌రూ సీనియ‌ర్ హీరోలే. అయితే రెమ్యున‌రేష‌న్ విష‌యంలో ఇంత తేడా ఏంటంటే ఓ స్టోరీయే ఉంది. క్రాక్‌కు మ‌లినేని గోపీ డైరెక్ట‌ర్‌.. గ‌తంలో ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో న‌టించిన శృతికి సెకండ్ ఇన్సింగ్స్‌లో ఛాన్సులు లేక‌పోవ‌డంతో పిలిచి మ‌రీ క్రాక్‌లో ఛాన్స్ ఇచ్చాడు. బ‌లుపు, క్రాక్ లాంటి హిట్ సినిమాల్లో ఆమె న‌టించింది. మ‌లినేని గోపీకి శృతీహాస‌న్ బాగా క‌లిసి వ‌చ్చిన హీరోయిన్‌.

పైగా రెండో ఇన్సింగ్స్‌లో క్రాక్ త‌ర్వాత బాల‌య్య సినిమాలోనూ ఆయ‌న ఛాన్స్ ఇవ్వ‌డంతో శృతి అదే చాల‌నుకుని పెద్ద‌గా డిమాండ్లు పెట్ట‌లేదు. ఇప్పుడు ఆయ‌న రిక్వెస్ట్ మేర‌కే బాల‌య్య సినిమాకు 1.5 కోట్లు అన‌గానే వెంట‌నే ఓకే చెప్పేసింద‌ట‌. అదే చిరుకు హీరోయిన్ల కొర‌త ఉంది. దీంతో నిర్మాత‌ల సైడ్ నుంచి ఆమెను అడ‌గ‌గానే.. ఆమె రు. 2 కోట్లు అడ‌గ‌డం వెంట‌నే మైత్రీ వాళ్లు కూడా ఓకే చెప్పేయ‌డం జ‌రిగిపోయాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news