Moviesనానితో పోటీ పడుతున్న అఖిల్..!

నానితో పోటీ పడుతున్న అఖిల్..!

వరుస విజయాలతో దూసుకెళ్తున్న నానికి పోటీగా సినిమాలను రిలీజ్ చేయాలంటే పెద్ద స్టార్లు కూడా! ఆలోచించుకోవాల్సిన పస్థితి ఉంది. అయితే అలాంటి పరిస్థితుల్లో కూడా నానితో పోటీకి సిద్ధమవుతున్నాడు అక్కినేని వారసుడు అఖిల్. అఖిల్ అంటూ మొదటి సినిమాతో ఫ్లాప్ చవిచూసిన అఖిల్.. రెండో సినిమా కోసం చాలా గ్యాప్ తీసుకున్నాడు.

విక్రం కుమార్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను నాగార్జున నిర్మిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా అఖిల్ స్టామినా ప్రూవ్ చేస్తుందని అంటున్నారు. సినిమా టైటిల్ గా “హలో గురు ప్రేమ కోసమే” అని పెట్టబోతున్నారట..! అయితే ఈ సినిమా డిసెంబర్ 22న రిలీజ్ చేయాలని చూస్తున్నారట.! ఇప్పటికే డిసెంబర్ 21న నాని “ఎం.సి.ఏ” మూవీ రిలీజ్ ఫిక్స్ చేసుకున్నాడు.

దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరాం డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. మరి సినిమా తీస్తే హిట్ అన్న విధంగా ఫుల్ ఫాంలో ఉన్న నాని, మొదటి సినిమా నిరాశ పరచగా రెండో సినిమాతో తన సత్తా చాటాలనుకున్న అఖిల్ ఇద్దరు ఒకేసారి బాక్సాఫీస్ ఫైట్ కు సిద్ధమవుతున్నారు. మరి వారిలో ఎవరు హిట్ కొడతారు అన్నది మాత్రం ఆ సినిమాలు వస్తేనే కాని చెప్పలేం.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news