నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన అఖండ సక్సెస్ ఫుల్ సెంచరీ కొట్టేస్తోంది. మరో వారం రోజుల్లో ఈ సినిమా 100 రోజులు పూర్తి చేసుకోబోతోంది. డిసెంబర్ 2న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మాస్ జాతరతో అఖంగ గర్జన మోగించేసింది. కలెక్షన్ల కమ్ముడు కుమ్మేసింది. ఏకంగా ఐదారు వారాల పాటు 80 శాతం ఆక్యుపెన్సీతో రన్ అయ్యింది. పుష్ప వచ్చినా.. సంక్రాంతికి బంగార్రాజు వచ్చినా కూడా అఖండ జోరుకు బ్రేకులు వేయలేకపోయాయి.
50 రోజుల పోస్టర్ అనేది కనుమరుగు అయిపోయిన ఈ రోజుల్లో అఖండ ఇండియాలోనే 103 కేంద్రాల్లో 50 రోజులు.. ప్రపంచ వ్యాప్తంగా 106 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకుంది. బాలయ్య సినిమా ఇప్పటి వరకు రు. 100 కోట్ల క్లబ్‌లో చేరలేదు. అయితే అఖండ దెబ్బతో రు. 100 – రు. 150 – రు. 200 కోట్లు కూడా క్రాస్ అయ్యాయి. ఈ సినిమా థియేట్రికల్ రన్‌తోనే రు. 150 కోట్లు కొల్లగొట్టింది. ఐదారు కేంద్రాల్లో ఈ సినిమా 100 రోజులకు చేరువ అవుతోంది.
ఈ నెల 12న కర్నూలులో అఖండ శతదినోత్సవం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. బాలయ్య ముఖ్య అతిథిగా వస్తాడని అంటున్నారు. ఇక అఖండ అరాచకం ఏపీ, తెలంగాణలోనే కాదు.. అటు ఓవర్సీస్లో కాదు.. కర్నాటక, మహారాష్ట్రలోనూ గర్జన మోగించింది. మహారాష్ట్రలో షోలాపూర్‌లో, కర్నాటకలోని రాయచూర్, బళ్లారి లాంటి చోట్ల భారీ వసూళ్లు కొల్లగొట్టింది. అటు కర్నాటకతో పాటు షోలాపూర్‌లోనూ 50 రోజులు ఆడింది.
ఓవర్సీస్‌లో అమెరికాలో మాత్రమే కాకుండా.. ఆస్ట్రేలియా, యూకేలోనూ భారీ వసూళ్లు రాబట్టింది. చాలా రోజుల తర్వాత బాలయ్య తన దెబ్బేంటో బాక్సాఫీస్ దగ్గర చూపించాడు. ఇటు అఖండ హిట్.. అటు బుల్లితెరపై అన్‌స్టాపబుల్ సూపర్ హిట్.. ఇప్పుడు వరుస సినిమాలు.. అటు అన్‌స్టాపబుల్ టాక్ షో రెండో సీజన్ కూడా సమాంతరంగా కంటిన్యూ అవుతున్నాయి. బాలయ్యకు సరైన సినిమా పడితే ఆ రేంజ్ ఎలా ఉంటుందో కర్నాటక, మహారాష్ట్ర వసూళ్లే ఫ్రూవ్ చేశాయి.