నందమూరి నటసింహం బాలకృష్ణ అఖండ గర్జన తర్వాత వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తన 107వ ప్రాజెక్టును మలినేని గోపీచంద్ దర్శకత్వంలో చేస్తున్నాడు. అఖండ తర్వాత బాలయ్య, క్రాక్ తర్వాత గోపీచంద్ చేస్తోన్న సినిమాలు కావడంతో సహజంగానే అంచనాలు ఉన్నాయి. మైత్రీ వాళ్లు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోన్న ఈ సినిమాలో శృతీహాసన్ హీరోయిన్గా చేస్తోంది. కోలీవుడ్ సీనియర్ హీరోయిన్ వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలో కనిపిస్తోంది.
యాక్షన్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా షూటింగ్ కంటిన్యూగా పూర్తి చేసి వచ్చే దసరాకు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ సిరిసిల్లలో స్టార్ట్ అవ్వగా.. ఇది దాదాపు పూర్తయ్యే దశకు వచ్చేసింది. రామ్ – లక్ష్మణ్ నేతృత్వంలో యాక్షన్ ఎపిసోడ్‌తోనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు. ఈ యాక్షన్ ఎపిసోడ్ చాలా బాగా వచ్చిందని ఇన్నర్ టాక్ ?
ఇక ఈ సినిమాపై మరో సూపర్ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమాలో బాలయ్యను ఢీకొట్టే పవర్ ఫుల్ ప్రతినాయకుడి పాత్రలో కన్నడ నటుడు దునియా విజయ్ నటిస్తున్నారు. తాజాగా దునియా షూటింగ్లో జాయిన్ అయ్యాడు. ఈ విషయాన్ని ఈ సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. షూటింగ్‌లోకి రాబోతున్న విజయ్‌కు దర్శకుడు గోపీచంద్ పుష్పగుచ్చం ఇచ్చి మరీ స్వాగతం పలుకున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు పాత్రల్లో కనిపిస్తారు. అఖండతో థియేటర్లు దద్దరిల్లిపోయేలా చేసిన థమన్ మరోసారి బాలయ్య సినిమాకు స్వరాలు అందిస్తున్నాడు. వరుస క్రేజీ లైనప్‌లతో ఉన్న బాలయ్యతో సినిమాలు చేసేందుకు మరికొందరు దర్శకులు కూడా క్యూలో ఉన్నారు. ఇక బాలయ్య హోస్ట్ చేసే టాక్ షో అన్‌స్టాపబుల్ కూడా రెండో సీజన్ జూలై నుంచి స్టార్ట్ అవుతుంది.
Overwhelmed by the warm welcome I received from brother @megopichand and DOP @dprishi.#NBK107 🦁 pic.twitter.com/EKePjmxE0J
— Duniya Vijay (@OfficialViji) March 7, 2022