ప్రస్తుతం మనం చూసిన్నట్లైతే ఏ హీరో ని కదిలించినా ..పాన్ ఇండియా సినిమాలు అంటూ వాటి మోజులో ఉన్నారు. పెద్ద పెద్ద స్టార్ హీరోస్ అందరూ తమ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కించే లా చూసుకుంటున్నారు. ఇక ఆ సినిమాలో ఉండే నటీమణులు..టెక్నీషియన్స్ కూడా అలానే ఉండాలని కోరుకుంటున్నారు. అందుకే ఈ మధ్య పక్క భాష భామలు మన ఇండస్ట్రీలో ఎక్కువుగా అవకాశాలు అందుకుంటున్నారు.
అయితే , సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం ..పాన్ ఇండియా సినిమాల జోలికి పోకుండా..తనకు లైఫ్ ఇచ్చిన తెలుగు ఇండస్ట్రీలోనే సినిమాలు చేస్తూ..”నాకు ఈ ఇండస్ట్రి ఎంతో ఇచ్చింది. నేను ఎంతో కొంత ఎంటర్ టైన్ మెంట్ రూపంలో..తిరిగిచ్చేస్తాను” అన్నట్లు తెలుగులోనే సినిమాలు చేస్తున్నాడు. ఇక్కడ మనం గుర్తించాలసిన మరో విషయం ఏమిటంటే పాన్ ఇండియా సినిమాలు చేస్తూ..60-70కోట్లు తీసుకుంటున్న సదరు హీరోల పారితోషకం తో సమానంగానే..మహేష్ బాబు తన ప్రజెంట్ సినిమా “సర్కారు వారి పాట” సినిమాకు తీసుకుంటున్నాడు. సినీ వర్గాల ప్రముఖుల దగ్గర నుండి అందుతున్న సమాచారం ప్రకారం..మహేష్ ఈ సినిమాకి 75 కోట్లు పారితోషకంగా అందుకుంటున్నాడట.
దీంతో పాన్ ఇండియా సినిమాలు చేయకుండానే ఆ రేంజ్ పారితోషకం తీసుకున్న ఏకైక హీరో గా మహేష్ సరికొత్త రికార్డ్ సృష్టించాడు. ఒక్క ప్యాన్ ఇండియా సినిమా కూడా చేయకుండానే.. ఈ స్థాయి పారితోషికం అందుకుంటోన్న తొలి తెలుగు నటుడు మహేష్ కావడం నిజంగా ఆయన అభిమానులు గర్వించదగ్గ విషయం. ఈ సినిమా కంప్లీట్ అవ్వగానే..మహేష్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో మరో సినిమా చేయబోతున్నాడు. ఇక ఆ తరువాత దర్శకధీరుడు రాజమౌళి తో ఓ ఆదిరిపోయే అడ్వెంచర్ మూవీ చేయడానికి రెడీగా ఉన్నాడు. ఈ సినిమా టైంకి మహేష్ ఖచ్చితంగా 100కోట్లు తీసుకుంటాదు అని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.