సినిమా వాళ్లు, బుల్లితెర నటీనటుల్లో ఇప్పుడు ప్రేమలు, డేటింగ్లు, బ్రేకప్‌లు కామన్ అయిపోయాయి. నిన్నమొన్నటి వరకు ఇవి సినిమా సెలబ్రిటీల్లోనే ఇవి తరచూ జరిగేవి. అయితే ఇప్పుడు ఇవి బుల్లితెర నటీనటులతో పాటు బిగ్‌బాస్ లవర్స్ మధ్య కూడా కామన్ అయిపోయాయి. తాజాగా మరో నటి, బిగ్‌బాస్ విన్నర్ కూడా తన ప్రియుడికి బ్రేకప్ చెప్పేసింది. నాలుగేళ్లుగా తన ప్రియుడితో డేటింగ్ చేస్తోన్న సదరు నటీమణి ఇప్పుడు ప్రియుడితో బంధాన్ని తెంచేసుకుంది.
ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో అధికారికంగా చెప్పేసింది. బిగ్‌బాస్ విన్నర్, నటీమణి అయిన దివ్య అగర్వాల్, తన ప్రియుడు వరుణ్ సూద్‌తో నాలుగేళ్లుగా డేటింగ్ చేస్తోంది. నాలుగేళ్లుగా వీరు కలిసే ఉంటున్నారు. వీరి రిలేషన్ పెవికాల్ను మించి స్ట్రాంగ్‌గా ఉండేది. పైగా ఇటీవలే వీరిద్దరు కలిసి ఇళ్లు కూడా కొనుగోలు చేశారు. అయితే ఇంతలోనే వీరు విడిపోవడం షాకింగ్ న్యూసే. మన జీవితం ఓ సర్కస్ లాంటిది అని.. అందరిని సంతోషంగా ఉంచేందుకు ప్రయత్నించాలని చెప్పిన ఆమె ఎవరి నుంచి ఏదీ ఆశించవద్దని చెప్పింది.
ఇక తన జీవితంలో జరుగుతున్న పరిణామాల పట్ల తాను ఎవ్వరిని ఏం నిందించనని కూడా చెప్పింది. తన కోసం తాను జీవించాలని అనుకుంటున్నానని.. చెపుతూ తన బ్రేకప్ విషయం అధికారికంగా ప్రకటించింది. ఇక టీవీ సీరిస్ ఎస్ ఆఫ్ స్పేస్‌కు ముందు నుంచే వరుణ్, దివ్యలు మంచి స్నేహితులు అయ్యారు. కాలక్రమంలోనే వీరి పరిచయం ప్రేమగా మారింది. ముందుగానే వరుణ్, దివ్యకు ప్రపోజ్ చేశాక ఆమె కూడా ఓకే చెప్పేసింది.
చాలా చూడచక్కని జంటగా ఉండే వీరిద్దరి ఇటీవలే ఇల్లు కూడా కొనుక్కోవడంతో త్వరలోనే పెళ్లి చేసుకుంటారని అందరూ అనుకుంటున్నారు. ఇంతలోనే ఏం జరిగిందో కాని.. దివ్య బ్రేకప్ పోస్టుతో అందరికి షాక్ ఇచ్చింది. విచిత్రం ఏంటంటే వరుణ్‌తో విడిపోతున్నా అతడిని మాత్రం ఒక్క మాట కూడా అనలేదు.. పైగా అతడితో గడిపిన క్షణాలు అన్నీ తనకు ఎంతో మధురమైనవి, సంతోషకరమైనవి అని చెప్పింది. ఓ నిర్ణయం తీసుకునేందుకు కారణాలు, సాకులు కూడా వద్దన్న ఆమె ఈ బంధం నుంచి బయటకు వచ్చేందుకు తాను తీసుకున్న నిర్ణయం సరైందే అని పేర్కొంది.