Moviesమహేష్ బాబుకు హ్యాట్సాఫ్‌ చెప్పిన రోజా..ఎందుకంటే..!!

మహేష్ బాబుకు హ్యాట్సాఫ్‌ చెప్పిన రోజా..ఎందుకంటే..!!

మహేష్ బాబు..ఇండస్ట్రీలో ఆయన అంటే తెలియని వారంటూ ఉండరు..తెలిసితే ఇష్టపడని వాళ్లంటూ ఉండరు. అంత మంచి యాక్టింగ్..అద్దిరిపోయే లుక్స్..పద్దతిగా బీహేవ్ చేసే సంస్కారం..అంతకు మించిన గొప్ప మనసు. వివిధ రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అభిమానుల మదిలో రియల్‌ హీరోగా పేరు తెచ్చుకుంటున్నాడు అందుకే సామాన్యులతో పాటు స్టార్ సెలబ్రిటీలు కూడా ఆయనను ఇష్టపడుతుంటారు. కేవలం ఇష్టపడటమే కాదు ఆయన తో కలిసి నటించాలని కోరుకుంటారు. ఇదే విషయాని ఇప్పటికే చాలా మంది బడా స్టార్స్ మీడియా ముఖంగానే చెప్పుకొచ్చారు.

మరీ ముఖ్యంగా సీనియర్ హీరోయిన్ రోజా అయితే చాలా సార్లు మహేష్ బాబు ని పొగిడేస్తూ..ఆయనతో కలిసి నటించాలని ఉందని చెప్పుకొస్తుంది. అంతేకాదు ఎప్పటికప్పుడు మహేష్ బాబు చేస్తున్న మంచి పనుల గురించి తెలుసుకుని.. అప్రిషియేట్ చేస్తుంటుంది. జనరల్ గా మహేష్ బాబు తాను చేస్తున్న సహాయం గురించి ఎవ్వరికి చెప్పుకోడు..కానీ మహేష్ చేస్తున్న మంచి పనుల గురించి రోజా గారు అభిమానులకు తెలియజేస్తుంటారు. మహేష్ లాంటి గొప్ప వ్యక్తి మన ఇందస్ట్రీలో ఉండటం చాలా సంతోషంగా ఉంటుందని చెప్పుకొస్తుంటారు.

అయితే తాజాగా మహేష్ చిన్నారుల హృదయ స్పందన కోసం తనMB ఫౌండేషన్, హైదరాబాద్‌ రెయిన్‌బో హాస్పిటల్‌ల సంయుక్త సహకారంతో ‘ప్యూర్‌ లిటిల్ హార్ట్స్’ ఫౌండేషన్‌ ప్రారంభించారు. దీనికి సంబంధించి శనివారం నాడు బంజారాహిల్స్‌లోని రెయిన్‌బో చిల్డ్రన్స్‌ హార్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆసుపత్రిలో మహేష్‌ లిటిల్ హార్ట్స్‌ ఫౌండేషన్‌ లోగోను ఆవిష్కరించారు. కాగా ఇంత మంచి పని చేసిన మహేష్ బాబు ని రోజా సెల్వమణి ప్రశంసల తో ముంచెత్తింది. ఈ కార్యక్రమంలో ప్రిన్స్‌ మాట్లాడుతున్న వీడియో షేర్ చేస్తూరోజా.. “పసి హృదయాల గుండె చప్పుడు వింటున్న సూపర్ స్టార్ మహేష్‌ బాబుకి హ్యాట్సాఫ్’ అంటూ ట్విట్టర్‌ లో పోస్ట్‌ పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట బాగా వైరల్ అవుతోంది.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news