Moviesస‌మంత కొత్త రేటుతో నిర్మాత‌ల‌కు చుక్క‌లు... ఏమ్మా ఈ వ‌య‌స్సులో ఇన్ని...

స‌మంత కొత్త రేటుతో నిర్మాత‌ల‌కు చుక్క‌లు… ఏమ్మా ఈ వ‌య‌స్సులో ఇన్ని కోట్లా…!

ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా సినిమా ఇండ‌స్ట్రీ.. ఇంకా చెప్పాలంటే మ‌న టాలీవుడ్ ఫుల్ స్వింగ్‌లో ఉంది. మ‌న సినిమాకు పాన్ ఇండియా మార్కెట్ వ‌చ్చేసింది. అటు క‌న్న‌డంతో పాటు త‌మిళ్‌, ఇటు నార్త్‌లో కూడా మంచి మార్కెట్ ఏర్ప‌డింది. బెల్లంకొండ శ్రీనివాస్ లాంటి మీడియం రేంజ్ సినిమాల‌కు కూడా టాలీవుడ్ బ‌య‌ట రు. 40 – 50 కోట్ల మార్కెట్ ఏదోలా జ‌రుగుతోంది. యూట్యూబ్ డబ్బింగ్గో, లేదా ఇత‌ర ఆడియో, వీడియో, యూట్యూబ్‌, శాటిలైట్ రైట్స్ ఇలా ఏదో రూపంలో అద‌న‌పు ఆదాయం భారీగా వ‌స్తోంది.

దీనికి త‌గ్గ‌ట్టే మ‌న తెలుగు హీరోలు, హీరోయిన్ల రెమ్యున‌రేష‌న్లు కూడా భారీగా పెరిగిపోయాయి. అస‌లు రేట్ల విష‌యంలో వీళ్లు ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కావ‌డం లేదు. మీడియం రేంజ్ హీరోల రెమ్యున‌రేష‌న్లు కూడా రు. 10 కోట్ల పైనే అంటున్నారు. ఇక సీనియ‌ర్ హీరోయిన్ స‌మంత విడాకుల త‌ర్వాత కూడా ఎక్క‌డా త‌గ్గేదేలే అంటూ రెచ్చిపోతోంది. పుష్ప‌లో ఊ అంటావా సాంగ్ లో ఎంత హాట్‌గా అందాలు ఆర‌బోసిందో చూశాం.. ఇక ఇప్పుడు వ‌రుస పెట్టి టాలీవుడ్‌, కోలీవుడ్‌.. బాలీవుడ్‌.. చివ‌ర‌కు హాలీవుడ్ సినిమాల‌కు సైతం ఓకే చెప్పేస్తోంది.

బోల్డ్‌గా చేసే విష‌యంలో కూడా అమ్మ‌డు ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. పుష్ప‌లో ఐటెం సాంగ్ చేసేందుకే మూడు రోజుల కాల్షీట్లు ఇచ్చేందుకు ఏకంగా రు. కోటికి పైగా రెమ్యున‌రేష‌న్ తీసుకుంది. ఇక ఇప్పుడు త‌న రెమ్యున‌రేష‌న్ కూడా బాగా పెంచేసింద‌ట‌. తెలుగులో హీరోయిన్ల రెమ్యున‌రేష‌న్లు బాగా పెరుగుతున్నాయి. న‌య‌న‌తార రు. 4 అంటోంది. పూజా హెగ్డే రు 3.5 త‌క్కువ‌కు చేయ‌నంటోంది. ర‌ష్మిక కూడా రు. 3కు త‌గ్గేదేలో అని ప‌ట్టుప‌బ‌డుతోంది. ఇక స‌మంత భ‌ర్త‌కు విడాకులు ఇచ్చేసి.. మూడున్న‌ర ప‌దుల వ‌య‌స్సుకు చేరువ అయిన కూడా త‌న‌కు కూడా రు. 3 కోట్లు కావాల‌ని డిమాండ్ చేస్తోంది.

పైగా నిర్మాత‌లు అడిగిన‌న్ని కాల్షీట్లు కూడా ఇవ్వ‌ద‌ట‌.. ఇలా చాలా కండీష‌న్లే ఉన్నాయ‌న్న గుస‌గుస‌లు ఇండ‌స్ట్రీలో వినిపిస్తున్నాయి. తాజాగా ఆమె శాకుంతం, య‌శోద అనే థ్రిల్ల‌ర్ సినిమాతో పాటు మ‌రో సినిమాకు ఓకే చెప్పేసింది. ఇవి కాకుండా మైత్రీ వాళ్లు శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా నిర్మించే సినిమాకు ఓకే చెప్పింది. ఈ పాన్ ఇండియా సినిమాలో న‌టించేందుకు స‌మంత రు. 3 కోట్ల రెమ్యున‌రేష‌న్ తీసుకుంటోద‌ట‌.

పుష్ప సినిమా కూడా ఇదే బ్యాన‌ర్లో తెర‌కెక్కింది. ఈ రిలేష‌న్‌తోనే ఇప్పుడు అదే బ్యాన‌ర్లో వ‌స్తోన్న ఈ సినిమాకు సైతం ఓకే చెప్పేసింద‌ట‌. ఏదేమైనా స‌మంత వ‌య‌స్సు పెరిగినా వ‌న్నె త‌గ్గ‌ట్లేదు.. రేటు విష‌యంలో ఎక్క‌డా రాజీప‌డ‌ట్లేదు.. ఇప్పుడు టాప్ హీరోయిన్ల‌కు పోటీగానే రెమ్యున‌రేష‌న్ తీసుకుంటోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news