Reviewsనాయకుడంటే ఇలా ఉండాలి.. నాకు నేనే ప్రీమియర్ షో రివ్యూ

నాయకుడంటే ఇలా ఉండాలి.. నాకు నేనే ప్రీమియర్ షో రివ్యూ

కొత్త సినిమాలను ప్రోత్సహించడంలో తెలుగు ప్రేక్షకులకు ఎవరు సాటిరారు. ఇంకా చెప్పాలంటే చిన్న సినిమాల్లో మంచి కథ కథనాలు ఉంటే తప్పకుండా ప్రేక్షకుల మెప్పు పొందినట్టే. ఈమధ్య కాలంలో స్టార్స్ సినిమాల కన్నా చిన్న సినిమాలు ఎక్కువ విజయాన్ని పొందటం చూస్తూనే ఉన్నాం. ఇక అలా చిన్న సినిమాల్లో ఓ ప్రభంజనం సృష్టించడానికి వచ్చిన సినిమా నాకు నేనే (తోపు-తురుం).

కథ విషయానికొస్తే.. పిత్రేపాళ్లెం అనే కొత్త ప్రపంచం నుండి వచ్చిన పిత్తికేసి ఓ హోటెల్ లో సర్వర్ గా సాధారణా పౌరుడిగా జీవనం సాగిస్తుంటాడు. అతని నిజాయితి ధైర్య సాహసాలను చూసి సిఎంగా అతన్ని ఎన్నుకుంటారు. అయితే సిఎం అయిన పిత్తికేసి తనలో మార్పులతో అందరిని ఆశ్చర్యపరుస్తాడు. సిఎం అయినా తను ప్రజలకు వ్యతిరేకంగా ఏవేవో పథకాలను ప్రవేశ పెడతాడు. టకీలా పథకంతో మధ్యపానం హోం డెలివరీ.. లపాకి పథకంతో వ్యభిచారానికి లైసెన్స్ లు ఇవ్వడంతో మహిళా సంఘాలు సిఎం మీద నిరసన జ్వాలలు మొదలు పెడతారు. అయినా సరే సిఎం ఏమాత్రం తగ్గకుండా మరింతగా రెచ్చిపోయి రేషన్ లోనే ఒక్క రూపాయికే ఉఫ్ ఉఫ్ పథకంతో గంజాయి,సిగరెట్, పాన్పరాగ్,గుట్కా, గంజాయి వంటి మాదక ద్రవ్యాలు అందిస్తూ ప్రజలకు మరింత తీవ్రస్థాయిలో ఆంధోళన వ్యక్తం చేసేలా చేస్తాడు. ఇదే సమయంలో రిజర్వేషన్ అనేది కులాలకు,మతాలకు కాదు ఆర్థిక స్థోమతను బట్టి వర్తిస్తుంది అని ప్రకటించటంతో ఒక్క సారిగా అప్పటికే విసిగి పోయిన ప్రజలు ఇక ఉండ బట్టలేక ..ప్రభుత్వానికి వ్యతిరేకంగా , నినాదాలు ,బంధులు, రాస్తారోకోలతో రాష్ట్రంలో అల్లకల్లోల పరిస్థితులు సృష్టిస్తారు. అధికార దుర్వినియోగానికి పాల్పడి కోట్లాది ప్రజల మనోభావాలను దెబ్బ తీయటంతో హీరో ను అరెస్ట్ చేసి పోలీసులు కోర్ట్ లో హాజరు పరుస్తారు. ఇక అసలు సినిమా ఇక్కడ మొదలవుతుంది. అసలు అంత మంచివాడిలా ఉన్న హీరో ఒక్కసారిగా ఎందుకు ఇన్ని కోట్ల మంది మనోభావాలను దెబ్బతీయాల్సి వచ్చింది అన్నదే క్లైమాక్స్ ధూమ పానం, మద్యపానం, పొగాకు వంటివి, యువతను ఎలా చెడ్డ దారులో వెళుతున్నారో చెబుతూ ఇలాంటివి అరికట్టాలంటే ప్రభుత్వాలు కాదు , ప్రజలు తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలి అని చెప్పటం ఈ సినిమా ముఖ్య కథ.

నటీనటుల ప్రతిభ :

సినిమా హీరో అశోక్ సుంకర నిజంగా ఇలాంటి సినిమా హీరోగా చేయడం గొప్ప విషయమని చెప్పొచ్చు. సినిమా మొత్తం తన భుజాల మీద వేసుకుని అవసరమైన పర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు. సినిమాలో నిజంగా అతని ప్రతిభ కనబడుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్ లో అశోక్ నటన అద్భుతమని చెప్పొచ్చు. మొదటి సినిమానే అయినా తను పలికించిన అభినయం అందరిని ఇంప్రెస్ చేస్తుంది. సీనియర్ నటుడు చలపతిరావు, కమెడియన్ సుమన్ శెట్టి కామెడి కూడా ఈ సినిమాకి చాలా ప్లస్ అయ్యాయి. చాలా రోజుల తరువాత సుమన్ శెట్టి కి మంచి క్యారక్టర్ పడిందని చెప్పొచ్చు.

ఇక దర్శకుడు రాసుకున్న కథ చాలా గొప్పగా ఉందని చెప్పొచ్చు. కథ కొత్తగా ఉండటం వరకు బాగున్నా కథనంలో కాస్త తడబడ్డాడని అనిపిస్తుంది. కథనంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేది. ఉన్నంత వరకు స్క్రీన్ ప్లే మేనేజ్ చేశాడు. అయితే కథ సాధారణ ఆడియెన్ కు ఈజీగా కనెక్ట్ అయ్యేలా మాత్రం చేశాడు. ప్రేమ ఎల్.ఎం సంగీతం పర్వాలేదు. నందమూరి హరి ఎడిటింగ్ సినిమాకు ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో అంతగా రిచ్ నెస్ లేకపోయినా ఇలాంటి ఓ మంచి ప్రయత్నం చేసినందుకు మెచ్చుకుని తీరాల్సిందే. సినిమాటోగ్రఫీ బాగుంది.

ప్లస్ పాయింట్స్ :

కథ
కథనం
కామెడీ
అద్భుతమైన డైలాగ్స్
హీరో అశోక్ సుంకర యాక్టింగ్
సంగీతం
ఎడిటింగ్

మైనస్ పాయింట్స్ :

డైరెక్షన్
హీరో డాన్స్ , ఫైట్లు

బాటం లైన్ : దేశం కోసం ఓ పౌరుడి త్యాగం.. నాకు నేనే (తోపు తురుం)
రేటింగ్: 3.0/5.0

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news