ఆమని రెండున్నర దశాబ్దాల క్రితం తెలుగుతోపాటు సౌత్ ఇండియాలో అన్ని భాషల్లో స్టార్ హీరోల సినిమాల్లో నటించి ఒక ఊపు ఊపేసింది. ఆమని అంటే ఈ తరం ప్రేక్షకులకు గుర్తు రాకపోవచ్చు. జగపతిబాబు హీరోగా ఎస్‌వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన శుభలగ్నం సినిమా ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆ సినిమాలో డబ్బు పిచ్చితో తన భర్తను రోజాకు అమ్ముకునే పాత్రలో నటించిన ఆమని అంటే ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆమని కన్నడ కస్తూరి. ఆమె స్వస్థలం బెంగళూరు. ఆమె అసలు పేరు మంజుల.
ముందుగా తమిళంలో నటించిన ఆమె పేరును ఇళయరాజా సోదరుడు మీనాగా మార్చారు. మంజుల అంటే పాత పేరని బాగోలేదని మీనా అని చేంజ్ చేశారు. అయితే అప్పటికే అదే పేరుతో మీనా అనే హీరోయిన్ ఉండడంతో చివరకు మీనాక్షి అన్న పేరు పెట్టారు. ఆ సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. అయితే ఆమె పేరును తెలుగులో ఈవీవీ సత్యనారాయణ ఆమనిగా మార్చేశారు. అప్పటి నుంచి మంజుల పేరు ఆమనిగా స్థిరపడిపోయింది.
హలో బ్రదర్ సినిమాలో ఆమని ఒక పాటలో కూడా నటించారు. అప్పుడు నాగార్జున ఆమనితో ఆమని అంటే అర్థం తెలుసా ? అని ప్రశ్నించాడట ఆమె తెలియదు అని చెప్పడంతో.. ఆమని అంటే వసంతని మంచి నేచర్ అని చెప్పిందట. నాగ్ నీకు ఈ పేరు ఎవరు పెట్టారు అని కూడా ఆమెను ప్రశ్నించారట. ఆమని ఈవీవీ సత్యనారాయణ గారు ఈ పేరు పెట్టారని చెప్పడంతో.. పేరు చాలా బాగుందని మెచ్చుకున్నారు అని ఆమె చెప్పింది.
ఇక జంబలడికిపంబ సినిమా కోసం సీన్లో భాగంగా ఆమనితో బలవంతంగా మందు కొట్టడంతో పాటు సిగరెట్ తాగడం నేర్పించారట. బాబోయ్ నేను సిగరెట్ తాగను అని చెప్పినా ఏం పర్లేదు.. జస్ట్ ఒక్క దమ్ము లాగి పొగ వదలమని చెప్పారట. ఎంతో కష్టం అని చెప్పినా ఆయన చేయాలని స్మూత్‌గా చెప్పడంతో చివరకు ఆమని రెండు, మూడు టేకుల్లో సిగరెట్ తాగడం నేర్చుకుందట.. ఆ తర్వాత మందు తాగినట్టు కూడా నటించాల్సి వచ్చిందని.. తన జీవితంలో ఈవీవీ సత్యనారాయణకు ఎప్పటకీ రుణపడి ఉంటానని ఆమె చెప్పింది.