అఖండ గర్జన ఇంకా మోగిస్తూనే ఉన్నాడు నటసింహం బాలకృష్ణ. అఖండ తర్వాత బాలయ్య మలినేని గోపీచంద్ దర్శకత్వంలో తన 107వ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీస్ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమా కంప్లీట్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. ఇటు బాలయ్యా యాక్షన్ హీరో.. అటు గోపీచంద్ కూడా యాక్షన్ సినిమాలకు కేరాఫ్. వీరిద్దరు కలిసి పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తే ఎలా ఉంటుందా ? అన్నది ఇప్పుడు ప్రేక్షకుల్లో ఆసక్తికి కారణమైంది.
ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ తెలంగాణలోని సిరిసిల్లలో ప్రారంభమైంది. ఈ సినిమా షూటింగ్ అలా స్టార్ట్ అయ్యిందో లేదో అదిరిపోయే అప్డేట్లు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఫస్ట్ లుక్‌తోనే బాలయ్య మరోసారి తన మ్యాస్ ర్యాంపేజ్ ఏంటో చూపిస్తున్నాడు. ఇక ఈ సినిమా గురించి కొన్ని అదిరిపోయే అప్డేట్స్ బయటకు వస్తున్నాయి. ఇవి సినిమాపై మరింత ఆసక్తి క్రియేట్ చేస్తున్నాయి.
ఇక ఇండస్ట్రీ ఇన్నర్ సైడ్ వర్గాల టాక్ ప్రకారం సినిమా కథ చాలా బాగా వచ్చిందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు పాత్రల్లో.. అది కూడా తండ్రి, కొడుకులుగా కనిపిస్తున్నారు. రాయలసీమలోని ఓ ప్రాంతానికి చెందిన నీటి సమస్య నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుందని.. స్క్రిఫ్ట్ వర్క్ చాలా పకడ్బందీగా మలినేని పూర్తి చేశారని తెలుస్తోంది. ఇక తండ్రి, కొడుకులుగా బాలయ్య రెండు పాత్రలు పూర్తి వైవిధ్యంతో ఉంటాయట.
ఇక ఈ సినిమాకు వీర సింహారెడ్డి టైటిల్ పరిశీలనలో ఉంది. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ సరసన శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తుండగా, ప్రతినాయకుడిగా కన్నడ నటుడు దునియా విజయ్, మరో కీలక పాత్రలో కోలీవుడ్ నటి వరలక్ష్మి శరత్‌కుమార్ నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో మరో హీరోయిన్ పాత్రకు స్కోప్ ఉందట.. ఆ పాత్ర కోసం శ్రీలీలతో పాటు అంజలి పేర్లు పరిశీలిస్తున్నారు.
బాలయ్య బ్లాక్‌బస్టర్ హిట్లు సమరసింహారెడ్డి, నరసింహానాయుడు సినిమాల్లో ముగ్గురు హీరోయిన్లు ఉంటారు. ఆ తర్వాత బాలయ్య చేసిన ఏ సినిమాలో అయినా ఇద్దరు హీరోయిన్లు ఉండడం కామన్ అయ్యింది. అఖండలో మాత్రమే ఒక్క హీరోయిన్ ఉంది. అయితే ఇప్పుడు కథ డిమాండ్ నేపథ్యంలో ముగ్గురు హీరోయిన్లను సెట్ చేస్తున్నారు. ఇక టైటిల్లో కూడా రెడ్డి ట్యాగ్ యాడ్ అవుతోంది. మరి ఇవన్నీ ఈ సినిమాకు ఎలా కలిసి వస్తాయో ? చూడాలి.