మా మాజీ అధ్యక్షుడు వీకే. నరేష్. చాలా బలమైన ఫ్యామిలీ నేపథ్యం ఉన్న వ్యక్తి. అటు తల్లి విజయనిర్మల ది గ్రేట్ నటీమణి. అద్భుతమైన నటి, దర్శకురాలు, నిర్మాత. ఎక్కువ సినిమాలకు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలిగా గిన్నీస్ బుక్‌లోకి కూడా ఎక్కింది. అటు తండ్రి సూపర్‌స్టార్ కృష్ణ తెలుగు సినిమా దిగ్గజనటుల్లో ఒకరు. అయితే నరేష్ విజయనిర్మలకు మొదటి భర్త సంతానం. మొదటి భర్తకు విడాకులు ఇచ్చాక కృష్ణకు కొడుకుగానే పెరిగాడు. ఇంకా చెప్పాలంటే విజయనిర్మల ఇచ్చిన కోట్లాది ఆస్తులకు వారసుడు. ఏం తక్కువ కాదు.. గతంలో హీరోగా కూడా చేశాడు. పర్లేదు కొన్ని సక్సెస్‌లూ ఉన్నాయి.. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా బాగానే చేస్తున్నాడు. మా అధ్యక్షుడిగా గెలిచి పెద్ద రాద్దాంతమే చేశాడు.
సరే ఇదంతా పక్కన పెడితే నరేష్ వ్యక్తిగత, వైవాహిక జీవితం మాత్రం ఏ మాత్రం ఆదర్శనీయం కాదు. నరేష్ మొదటి భార్య సీనియర్ కెమేరామెన్ / కొరియోగ్రాఫర్ శ్రీనివాస్ కుమార్తె. తల్లి విజయనిర్మల స్వయంగా ఈ సంబంధం కుదిర్చి చేశారు. వీరికి నవీన్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. అన్నట్టు నవీన్ కూడా సినిమాల్లోకి వచ్చాడు. ఆ సినిమా సక్సెస్ కాలేదు. ఇక కొద్ది రోజుల కాపురం తర్వాత మనస్పర్థలు రావడంతో నరేష్ తన భార్యకు విడాకులు ఇచ్చేశాడు.
ఆ తర్వాత దేవులపల్లి కృష్ణశాస్త్రి మనవరాలు రేఖా సుప్రియతో రెండో వివాహం.. అది కూడా పెటాకులు అయ్యింది. ఆ తర్వాత ఏపీ మాజీ మంత్రి రఘువీరారెడ్డి తమ్ముడు కుమార్తె రమ్య రఘుపతితో మూడో పెళ్లి. అసలు వీరి పెళ్లి జరిగే టైంలోనే నరేష్ వయస్సు 50, రమ్య వయస్సు 25. వీరు ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారో ? కూడా ఎవ్వరికి అర్థం కాలేదు. ఈ దంపతులకు ఓ కుమారుడు పుట్టిన వెంటనే మళ్లీ మనస్పర్థలు ఎవరి దారి వారిదే. అయితే వీరు విడిపోయినా అధికారికంగా విడాకులు తీసుకోలేదని టాక్ ? రమ్య నెలవారి మెయింటైన్స్ మాత్రం నరేష్ ఇస్తున్నాడని అంటున్నారు.
ఇక ఇప్పుడు రమ్య నరేష్ పేరు చెప్పి రు. 7-8 కోట్లు వసూలు చేసిందన్న ఆరోపణలు తీవ్రంగా వస్తున్నాయి. అందుకే రమ్యతో పాటు నరేష్ కూడా వార్తల్లోకి ఎక్కారు. ఇప్పుడు నరేష్ వయస్సు 62. క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్రా లోకేష్‌తో నరేష్ కలిసి ఉంటున్నారట్ట. ఈ విషయం ఇప్పుడు ఫిల్మ్‌నగర్ అంతా కోడై కూస్తోంది. ఆమెను రేపో మాపో పెళ్లి చేసుకుంటారన్న ప్రచారమూ ఉంది. ఆమె వయస్సు 43.
పవిత్రాకు కూడా ఇంతకుముందే పెళ్లయ్యింది. ఆమె భర్త సుచేంద్రా ప్రసాద్ అనే నటుడు.. ఆయనకు కూడా పవిత్ర రెండో పెళ్లాం. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వీరికి కూడా విడాకులు అయినట్టు లేవంటున్నారు. ఇక నరేష్ – పవిత్ర ఎక్కడ చూసినా జంటగా కనిపిస్తున్నారు. కృష్ణ ఫ్యామిలీ పర్సనల్ ఫంక్షన్లకు కూడా నరేష్ పవిత్రతో కలిసే హాజరవుతున్నాడు. మరి నరేష్ లైఫ్‌లోకి పవిత్ర నాలుగో భార్యగా ఎంటర్ అవుతుందా ? లేదా అన్నది కాలమే చెప్పాలి.