ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు..ఈ సినిమా గుర్తు ఉంది కదా. హా..అయినా ఇది మర్చిపోయే సినిమానా. కడుపుబ్బా నవ్వించే కామెడీ సీన్స్ ఎన్నో..మొగుడు పెళ్లాల మధ్య వచ్చే ఫన్నీ సీన్స్ ను డైరెక్టర్ బాగా చూపించారు. దీంతో అప్పట్లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అంతేకాదు విక్టరీ వెంకటేష్ – సౌందర్య కాంబినేషన్లో ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలు వచ్చాయి.. కానీ ఈ సినిమా సక్సెస్ అయినంతగా మరేది కాలేదు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యింది. అప్పట్లో మహిళా ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. సినిమాను పదే పదే చూడడంతోనే చాలా చోట్ల 200 రోజులు కూడా ఆడింది. ఇక ఈ సినిమాలో వెంకీ రెండో భార్య మనీషాగా వినీత నటించింది. ఇక ఈ సినిమాలో ఆమెకు వెంకటేష్ కారణంగా ఓ కొడుకు పుడతాడు గుర్తుందిగా..అదే వెంకటేష్ తో ఓ సీన్ లో తల్లో మెల్లేపూలు ఎల పెడుతున్నావో చూస్తున్న అంటూ ఫనీ మాట్లాడుతాడు. హా ఆ బాబే ఇప్పుడు పెద్ద అయ్యడు హీరో కూడా అయ్యాడు.
ఇంట్లో ఇల్లాలు వట్టింట్లో ప్రియురాలు చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించిన ఆ అబ్బాయి పేరు నాగ అన్వేష్ ఏంజిల్ . చిన్నప్పుడే తన నటనతో అందరినీ ఆకట్టుకున్న నాగ అన్వేష్.. ప్రముఖ నిర్మాత సింధూరపువ్వు కృష్ణారెడ్డి కుమారుడు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసింది ఒక్క సినిమానే అయినా.. అందరికీ గుర్తుండిపోయాడు.వినవయ్యా రామయ్యా చిత్రాలతో హీరోగా మారాడు. కానీ ఈ సినిమాలు కుర్ర హీరోకు ఆశించిన ఫలితాలను అందించలేదు. అయితే నటన పరంగా మాత్రం మంచి మార్కులే వేయించుకున్నాడు. ఈ కుర్ర హీరో ప్రేమలో పడ్డాడు..అంతేనా గుట్టు చప్పుడు కాకుండా నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు. ఇక ఆ తరువాత ఆ ఫోటోలు రిలీజ్ చేసారు. దీంతో ఆ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
శనివారం నాడు నాగ అన్వేష్ తను ప్రేమించిన అమ్మాయితో అంగరంగ వైభవంగా హైదరాబాద్ లో నిశితార్థం జరుపుకున్నారు.గత కొంత కాలంగా కావ్య అనే తన స్నేహితురాలిని ప్రేమించిన అన్వేష్ .. ఇంట్లో వారిని ఒప్పించి నిశ్చితార్థం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక కావ్య తండ్రి ఎవరో కాదు ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ అపర్ణ కంపెనీ డైరెక్టర్ విజయ్ కుమార్. బడా ఇండికి అల్లుడు కాబోతున్న వెంకటేష్ కోడుకు నిశ్చితార్ధానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారింది. ఇక అతి త్వరలోనే ఈ జంట వివాహం అంగరంగ వైభవంగా జరగనున్నట్లు సమాచారం. ఈ వేడకకు ఇరు కుటుంబాలతో పాటు స్నేహితులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు హాజరయ్యారు.