ఏ రంగంలో ఉన్నవారికి అయినా హిట్స్, విజయాలు ఉన్నంత కాలమే క్రేజ్ ఉంటుంది. ఇది సినిమా రంగానికి కూడా వర్తిస్తుంది. అది నటీనటులు అయినా, దర్శకులు అయినా కూడా ఒక్క ప్లాప్ పడితే ఎక్కడో శిఖరాల మీద ఉన్నోళ్లు సైతం పాతాళంలో పడిపోతారు. ఇది ఇండస్ట్రీ ఎరిగిన సత్యం అని చెప్పాలి. అలాగే ఎన్ని ప్లాపుల్లో ఉన్న వాళ్లు అయినా ఒక్క హిట్‌పడితే వెంటనే ఫామ్‌లోకి వచ్చేస్తారు. ఇక మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా సినిమాల్లోకి వచ్చాడు మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్.
తొలి సినిమా చిరుత హిట్ అయ్యాక మూడేళ్లు గ్యాప్ తీసుకుని దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మగధీర సినిమా చేశాడు. చిరుత, మగధీర దెబ్బతో రామ్‌చరణ్ రేంజ్, క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. అసలు స్టార్ హీరోలు సైతం రామ్‌చరణ్‌ను చూసి షాక్ అయ్యే రేంజ్‌కు వెళ్లిపోయాడు. మగధీర తర్వాత బొమ్మరిల్లుతో ఫామ్‌లో ఉన్న భాస్కర్ దర్శకత్వంలో ఆరెంజ్ సినిమా చేశాడు. ఈ సినిమా ఘోరమైన డిజాస్టర్ అయ్యింది.
మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత చేసిన సినిమా అంటే ఓ మోస్తరు కంటెంట్ ఉన్నా సినిమా సూపర్ హిట్ అవ్వాలి.. మగధీర యేడాది పాటు ఆడితే.. ఆరెంజ్ వారం రోజులకే థియేటర్ల నుంచి చాప చుట్టేసింది. ఈ సినిమా బయ్యర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు తెచ్చిపెట్టింది. అటు నిర్మాత నాగబాబు సైతం ఆర్థికంగా దెబ్బతిని చాలా రోజుల వరకు కోలుకోలేని పరిస్థితి. జెనీలియా హీరోయిన్‌గా, హరీష్‌జైరాజ్ మ్యూజిక్ ఇచ్చిన ఈ క్రిటికల్ లవ్‌స్టోరీ కొందరితో పాటు యువతకు బాగానే నచ్చినా చాలా మందికి అర్థం కాలేదు.
సినిమా నెరేషన్ కూడా టిఫికల్‌గా ఉండడంతో జనాలకు నచ్చలేదు. ఈ సినిమా డిజాస్టర్‌తో రామ్‌చరణ్ నైరాశ్యంలోకి వెళ్లిపోయాడు. ఆ టైంలో దర్శకనిర్మాతలు ఎవ్వరూ రామ్‌చరణ్‌తో సినిమా చేసేందుకే ముందుకు రాలేదట. అస్సలు నిర్మాతలు ఎవ్వరూ తన వద్దకు వచ్చి సినిమా చేస్తానని కూడా అనలేదని నాటి సంఘటన గుర్తు చేసుకుని రామ్‌చరణ్ తన తాజా ఇంటర్వ్యూలో ఎమోషనల్ అయ్యాడు.
ఆరెంజ్ ప్లాప్ అయినా కూడా తన వద్దకు వచ్చి సినిమా చేయాలని కోరింది ఆర్‌బి. చౌదరి మాత్రమే అని చరణ్ చెప్పాడు. ఆయనకు తాను ఎప్పటకీ కృతజ్ఞతలు చెపుతున్నానని చరణ్ అన్నాడు. ఇక తాను ఎప్పుడూ ఇలాంటి దర్శకుడితోనే సినిమా చేయాలని అనుకోలేదని.. ఎవరు వచ్చి కథ చెప్పినా.. కథ నచ్చితే ఓకే చేశానని రామ్‌చరణ్ చెప్పాడు. ఇక రాజమౌళి త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా పరిచయం అవుతోన్న చరణ్, తన తండ్రి చిరుతో కలిసి చేసిన ఆచార్య సినిమా కూడా రిలీజ్ అవుతోంది.