అక్కినేని నాగార్జునకు నిన్నేపెళ్లాడతా సినిమాతో ఎంతటి రొమాంటిక్ ఇమేజ్ వచ్చిందో ఆ ఇమేజ్‌ను ఇప్పటి వరకు కంటిన్యూ చేసింది మాత్రం మన్మథుడు సినిమాయే. 2002లో క్రిస్మస్ కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమాతో నాగార్జున ఆ తరం నుంచి నేటి తరం వరకు అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిపోయాడు. కె. విజయ్ భాస్కర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను నాగార్జున స్వయంగా నిర్మించాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాతోనే బాగా పాపులర్ అయ్యాడు.
ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ భామ సోనాలిబింద్రేను రెండో హీరోయిన్‌గా కొత్తమ్మాయి అన్షును తీసుకున్నారు. ఆ సినిమాతోనే ఆమె బాగా పాపులర్ అయ్యింది. ఆమెను నాగార్జున ప్రేమించడం.. ఆ తర్వాత ఆమె యాక్సిడెంట్‌లో మరణించాక.. నాగార్జున ఆమె మరణించిన విషయం చెప్పకుండా.. మోసం చేసి మరో పెళ్లి చేసుకుందని చెప్పడంతోనే నాగార్జునకు అమ్మాయిలు అంటేనే అసహ్యం ఉంటుంది. ఈ సినిమాలో గుండెల్లో ఏముందో అన్న పాటలో అన్షు, నాగ్ జంట ఎంత చూడముచ్చటగా ఉందో చెప్పక్కర్లేదు. ఈ పాట ఇప్పటకీ టీవీల్లో వస్తుంటే సినీ ప్రేమికులు ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు.
ఆ సినిమా డైరెక్టర్ కె. విజయ్ భాస్కర్ పట్టుబట్టి మరి చాలా మంది హీరోయిన్లను టెస్ట్ చేసి నాగ్ పక్కన కొత్త అమ్మాయి బాగుంటుందని అన్షును సెలక్ట్ చేశాడు. ఈ సినిమా అప్పట్లోనే అమెరికాలో 50 రోజులు ఆడింది. ఇది చాలా గొప్ప రికార్డు. అన్షు మన్మథుడు తర్వాత యంగ్‌రెబల్ స్టార్ ప్రభాస్ పక్కన రాఘవేంద్ర సినిమా చేసింది. ఈ సినిమా తర్వాత ఆమె మళ్లీ వెండితెరపై కనపడలేదు. అన్షు తెలుగులో చేసింది ఈ రెండు సినిమాలే అయినా ఆమెకు యూత్‌లో మంచి అభిమానులు ఏర్పడ్డారు.
ఇక అన్షు తమిళ్‌లో ప్రశాంత్ నటించిన జై సినిమాలో నటించి మెప్పించింది. ఆ తర్వాత ఆమె తన జన్మస్థలం అయిన లండన్‌కు తిరిగి వెళ్లిపోయింది. సినిమాలకు దూరం అయ్యాక ఆమె అక్కడే ఉన్నత విద్య అభ్యసించింది. ఆ తర్వాత సచిన్ అనే వ్యాపారవేత్తను పెళ్లాడి యూకేలో స్థిరపడిపోయి అక్కడే ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. ప్రస్తుతం అన్షుకు ఓ కుమార్తె ఉంది. అక్కడే ఆమె ఫ్యాషన్ డిజైనర్‌గా ని చేస్తోంది. అన్షు సొంతంగా డిజైనర్ లేబుల్ ఇన్‌స్పిరేషన్ కోచర్ కూడా కలిగి ఉంది. ఇక మన్మథుడు సినిమాలో నటనకు గాను ఆమె ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకుంది.