రాధిక గుర్తుండే ఉంటుంది.. తమిళ్ అమ్మాయి అయిన ఆమె న్యాయం కావాలి సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. 1980వ దశకంలో రాధిక అంటే అటు తమిళ్‌తో పాటు ఇటు తెలుగులో క్రేజీ హీరోయిన్. ఆమె గ్లామర్ డోస్ కోసం యూత్ పడిచచ్చేవాళ్లు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి – రాధిక కాంబినేషన్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. వీరిద్దరి కాంబినేషన్ అంటేనే నాడు తెలుగు ఆడియెన్స్‌లో బ్లాక్‌బస్టర్ అన్న టాక్ ఉండేది.
రాధిక అప్పట్లో కృష్ణ, చిరంజీవి, ఏఎన్నార్, శోభన్‌బాబు లాంటి క్రేజీ హీరోలతో క్రేజీ కాంబినేషన్లలో సినిమాలు చేసేది. ఆమె చెల్లెలు అయిన నిరోషా తెలుగులో బాలకృష్ణ హీరోగా కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన నారినారి నడుమ మురారి సినిమాతో స్ట్రైట్‌గా ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా సిల్వర్ జూబ్లి ఆడేసింది. బాలయ్య శోభన – నిరోషా మధ్య నలిగిపోయే ముద్దుల బావగా నటించారు.
నిరోషాది మాంచి ఛార్మింగ్ ఫేస్. ఆ తర్వాత ఆమె చిరంజీవి సరసన స్టూవర్ట్‌పురం పోలీస్‌స్టేషన్ సినిమాలో కూడా నటించింది. తమిళం నుంచి తెలుగులో డబ్బింగ్ అయిన ఘర్షణ సినిమాలో ఆమె పాత్ర తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. ఆ సినిమాలో ఒక బృందావనం సోయంగం అనే స్విమ్మింగ్ పూల్ పాట తెలుగు జనాలకు ఎలా మత్తెక్కించేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఆ తర్వాత 1988లో తమిళ్‌లో సింధూరపువ్వై అనే సినిమాను తెలుగులో సింధూరపువ్వుగా డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. 1989లో ఇక్కడ రిలీజ్ అయిన సింధూరపువ్వు సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్ పాయింట్ ఉంది. ఈ సినిమా హీరోయిన్‌గా రాధిక చెల్లి అయిన నిరోషాను తీసుకున్నారు. ఆమె ఫొటో చూసిన హీరో రాంకీ ఆమె పనిపిల్లలా ఉంది.. హీరోయిన్ ఏంటని కామెంట్ చేశారట.
అయితే దర్శకుడు దేవరాజ్ మాత్రం ఆమెనే హీరోయిన్‌గా సెలక్ట్ చేశారు. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత రాంకీ – నిరోషా కాంబోలో తమిళంలో ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా ఏడెనిమిది శతదినోత్సవ సినిమాలు వచ్చాయి. ఆ టైంలోనే వారిద్దరు ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. ఇక రాంకీ ఇటీవల వచ్చిన ఆర్ఎక్స్ 100 సినిమాలో కనిపించారు. నిరోషా సీరియల్స్‌లో బిజీగా ఉంది.