“Are You a Virgin”..గట్టిగా అందరికి వినపడేలా చెప్పండి… ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్లుందే అని అనుకుంటున్నారా.. యస్..పవన్ కల్యాణ్ రీ ఎంట్రీతో అదరకొట్టేసిన మూవీ “వకీల్ సాబ్”. ఈ సినిమాలో లాయర్ ప్రకాష్ రాజ్ వన్ ఆఫ్ ది హీరోయిన్ నివేదా థామస్ ని విచారణలో భాగంగా ఇలాగే అడుగుతాడు. అది అంటే సినిమా..అందుకే హీరోయిన్ లైట్ తీసుకుంది. అదే నిజ జీవితంలో ఎవ్వరైన అడిగితే..? చెప్పు తీసుకుని కొట్టి సమాధానం ఇస్తుంది. ఆమె కాదు ఏ అమ్మాయి అయినా అలానే చేస్తుంది. ఇక ఇప్పుడు ఇక్కడ ఓ హీరోయిన్ కూడా అంత పనే చేయబోయింది. పూర్తి వివరాల్లోకెళితే…
నిర్మాత లగడపాటి శిరీష శ్రీధర్ తనయుడు విక్రమ్ సాహిదేవ్ హీరోగా పరిచయమై నటించిన సినిమా “వర్జిన్ స్టోరీ”. యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ తో ఈ శుక్రవారం హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో సౌమిక పాండియన్ – రిషిక ఖన్నా హీరోయిన్లుగా నటించారు. ప్రదీప్ బి అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాని రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీష – శ్రీధర్ నిర్మించారు. కాగా సినిమాలో విక్రమ్ సహిదేవ్ నటన చూడటానికి చాలా బాగుంది. తన డ్యాన్స్ స్కిల్స్‌తోనూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. హీరోయిన్ సౌమిక పాండియన్ కూడా కొన్ని సీన్లల్లో బాగా నటించింది. ప్రజెంట్ యువత ఆలోచనా విధానం ఎలా ఉంది అనేది ఈ సినిమాలో చూపించడానికి ట్రై చేశాడు డైరెక్టర్..కానీ వర్క్ అవుట్ అవ్వలేదు.
అయితే, ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా..హీరో హీరోయిన్లు ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. యాంకర్ కూడా మంచిగా నవ్వుతూనే.. హీరో హీరోయిన్లు ఆటపట్టిస్తూనే..అడగాల్సిన వాని అడుగుతూ వచ్చాడు. ఇక వాళ్ళు కూడా కూల్ గా తెలివిగా ఆన్సర్ ఇస్తూ ఎక్కడిక్కడ టాపిక్ ను కట్ చేస్తూ వచ్చారు. అయితే ఆ యాంకర్ అడిగిన ఓ ప్రశ్నకి హీరోయిన్..తిట్టిని తిట్టు తిట్టకుండా టిట్టింది ఆ యాంకర్ ని. బోల్డ్ టైటిల్ అయ్యేసిరికి సినిమా కూడా బోల్డ్ గా ఉంటుంది అనుకున్నాడు ఏమో తెలియదు కానీ..హీరో హీరోయిన్లలను మరీ బోల్డ్‌గా..అసలు మీలో ఎవరు వర్జిన్..? అని అడిగేశాడు.
ఇక హీరోయిన్ కోపం వచ్చి యంకర్ ని తిడుతూ..నీకు బిద్ధి ఉందా ఇలాంటి ప్రశ్న లు అడుగుతారా..? తెలివి లేదా అంటూ తిట్టేసి మైక్ తీసెసి బయటకు వెళ్లిపోయింది. ఇక కొంచెంసేపు వాళ్లను బుజ్జగించి కూల్ చేసి ఫైనల్ గా మళ్లీ ఇంటర్వ్యు కంటిన్యూ చేసాడు. అయితే ఇదంతా చూసిన జనాలకు ఇది పక్క స్క్రిప్ట్ అని అర్ధమైపోయింది. అమ్మడు ని బుజ్జగించే క్రమంలో వాళ్లు చేసిన ప్రతి సీన్ నటన అని ..అస్సలకి నేచురల్ గా లేదని క్లీయర్ గా తెలుస్తుంది. ఇక దీంతో సినిమాల ప్రమోషన్ కోసం ఇలాంటివి కూడా చేస్తారా అంటూ రీవర్స్ గా హీరోయిన్ ని, ఆ యాంకర్ ని ఇద్దరిని తిట్టిపోస్తున్నారు జనాలు.