క్యాస్టింగ్ కౌచ్.. ఇండస్ట్రీలో ఎంతో కాలంగా పేరుకుపోయిన వైరస్ ఇది. కరోనా లాంటి భయంకరమైన వైరస్ కి అయినా మందు కనుకుంటున్నారు కానీ..క్యాస్టింగ్ కౌచ్ కు మాత్రం మదే లేదు. ఈ క్యాస్టింగ్ కౌచ్ కారణంగా ఎంతో మంది అమ్మాయిలు సినీ ఇండస్ట్రీలోకి రావలి అని అనుకున్న భయపడి రాలేకపోతున్నారు. సౌత్ టు నార్త్ అన్ని సినిమా ఇండస్ట్రీల్లోనూ ఈ కాస్టింగ్ కౌచ్ ఇప్పుడు ఓ జాడ్యం మాదిరిగా మారిపోయింది. ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు ధైర్యంగా బయటకు వచ్చి మరీ కాస్టింగ్ కౌచ్ గురించి చెపుతున్నారు. దీంతో వరుసపెట్టి పలువురు హీరోయిన్లు తాము కాస్టింగ్ కౌచ్ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నామో చెప్పారు.
అయితే తాజాగా ఈ క్యాస్టింగ్ కౌచ్ నోరు విప్పింది అనుష్క. తాను ఇలాంటివి ఫేస్ చేశానని..బిగ్ బాంబ్ పేల్చింది. ఇటీవల ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తొలిసారి కాస్టింగ్ కౌచ్‌పై నోరు విప్పింది. ఆ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుష్క టాలీవుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. టాలీవుడ్లో చాలా మంది మహిళలు లైంగిక వేధింపులతో ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని నేను కూడా అంగీకరిస్తాను.
అవకాశాలు ఆశచూపి అమ్మాయిలను లొంగదీసుకునే విష సంస్కృతి టాలీవుడ్ లో కూడా ఉంది. కెరీర్ బిగినింగ్ లో నేను కూడా ఇలాంటివి చూశాను. అయితే నేను ప్రతి విషయంలో నిక్కచ్చిగా ఉంటా.. మొహానే మాట్లాడతాను, కాబట్టి నా దగ్గరకు వచ్చి ఇలా అడిగే సాహసం చేయలేదు. ఎవరూ ఇలాంటి ప్రతిపాదనలు నా వరకు తీసుకురాలేదు. ఒక్క చిత్ర పరిశ్రమలోనే కాదు, చాలా రంగాల్లో అమ్మాయిలు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారు..అంటూ చెప్పుకొచ్చింది.
ఇక సినిమాల విషయానికి వస్తే బాహుబలి తర్వాత అనుష్క సినిమాలు తగ్గించారు. ఆఫర్లు వస్తున్నా ఆచితూచి సినిమాలు చేస్తున్నారు. అప్పుడెప్పుడో నిశబ్ధం సినిమాలో చూసిన అనుష్కను మళ్ళీ తెర పై త్వరలోనే చూడబోతున్నం. నవీన్ పోలిశెట్టి హీరోగా అనుష్క హీరోయిన్ గా ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.