Newsపవన్ కళ్యాణ్ ను ఫుల్ గా వాడేసిన సాయి పల్లవి..!

పవన్ కళ్యాణ్ ను ఫుల్ గా వాడేసిన సాయి పల్లవి..!

నిన్న రిలీజ్ అయిన వరుణ్ తేజ్ ఫిదా చూసిన వారెవరైనా సరే హీరోయిన్ సాయి పల్లవి గురించి మాట్లాడకుండా ఉండలేరు. భానుమతిగా సాయి పల్లవి చూపించిన అభినయం అందరిని అవాక్కయ్యేలా చేసింది. మలయాళ భామనే అయినా అచ్చం తెలంగాణా ఆడపడచులా అబ్బో అదరగొట్టేసింది. అయితే ఈ సినిమాలో సాయి పల్లవి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఇమిటేట్ కూడా చేసింది.

సినిమాలో భానుమతి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్.. పవన్ మేనరిజం అయిన మెడకింద చేయి పెట్టడంతో పాటుగా ఛాన్స్ దొరికితే పవన్ మీద తనకున్న అభిమానం చూపించేసింది సాయి పల్లవి. నిర్మాత దిల్ రాజు పవర్ స్టార్ క్రేజ్ ను క్యాష్ చేసుకునే ఆలోచనతోనే హీరోయిన్ పవన్ ఫ్యాన్ అని మెన్షన్ చేయించాడు.

ఓ పక్క హీరోని ప్రేమించినా తన ఊరు.. తన తండ్రిని విడిచి వెళ్లలేని భాను ఫైనల్ గా తను అనుకున్న రెక్కల రాజకుమారుడు వరుణ్ ను తనకు నచ్చినట్టుగా మార్చుకుంటుంది. మెగా హీరో సినిమా కాబట్టి ఇందులో పవర్ స్టార్ భజన కామనే.. కాని సాయి పల్లవి యాటిట్యూడ్ కు తిక్క అంటూ గబ్బర్ సింగ్ డైలాగ్ కూడా వాడటం సినిమాకు మరింత క్రేజ్ తెచ్చింది. స్పెషల్ మెన్షన్ కింద అమ్మడిని పవర్ స్టార్ ఫ్యాన్ అంటూ చెప్పడం పవన్ ఫ్యాన్స్ కు సినిమా ఎక్కించే ప్రయత్నమనే చెప్పాలి. మొత్తానికి మెగా హీరో వరుణ్ తేజ్ అకౌంట్ లో ఓ సూపర్ హిట్ పడింది. మెగా ఫయాన్స్ ఈ సినిమా విజయాన్ని గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news