Moviesఇది బోయపాటి సింహగర్జన.. కుర్రాడితో కూడా కుమ్మేశాడు..!

ఇది బోయపాటి సింహగర్జన.. కుర్రాడితో కూడా కుమ్మేశాడు..!

సరైనోడు తర్వాత బోయపాటి శ్రీను డైరక్షన్ లో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వస్తున్న సినిమా జయ జానకి నాయక. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా టీజర్ నిన్న రిలీజ్ అయ్యింది. టైటిల్ దగ్గర నుండి ఇంతకుముందు వచ్చిన టీజర్ వరకు బోయపాటి తన మాస్ అంశాలకు దూరంగా ఈ సినిమా తీశాడని అనిపించింది.

కాని ఈ లేటెస్ట్ టీజర్ మాత్రం అబ్బో మళ్లీ బోయపాటి సింహ గర్జన మొదలైందని అనుకుంటున్నారు. కుర్ర హీరోతో కూడా కుమ్మేసే టీజర్ తో వచ్చాడు బోయపాటి. తన మార్క్ కనిపించేలా ఉన్నది స్టార్ హీరో కాదని తెలిసినా తన రేంజ్ ఏమాత్రం తగ్గకుండా బోయపాటి జయ జానకి నాయకా టీజర్ వదిలారు. ఇక ఈ టీజర్ చూస్తే కచ్చితంగా సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో చెప్పొచ్చు.

హీరో ఎవరన్నది కాదు.. నేను ఎక్కువగా మాట్లాడను.. నా సినిమా మాట్లాడుతుంది.. అంటూ బోయపాటి డైలాగ్స్ కాస్త రొటీన్ గా అనిపించినా అందులో కచ్చితంగా నిజం ఉందని తెలుస్తుంది. ఎందుకంటే సరైనోడు తర్వాత స్టార్స్ ఆఫర్ వస్తున్నా ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం బెల్లంకొండ శ్రీనివాస్ తో సినిమా చేశాడు. టీజర్ హంగామా చూస్తుంటే ఇది కూడా బోయపాటి ఎకౌంట్ లో మరో హిట్ సినిమా అవుతుందని అనిపిస్తుంది. ఇక ఎంట్రీలో చేసిన ఒకటి రెండు సినిమాలు బోల్తా కొట్టడంతో ఈసారి బెల్లంకొండ శ్రీనివాస్ కూడా హిట్ కొట్టాలని గట్టిగానే ఫిక్స్ అయినట్టున్నాడు. అందుకే మూడో సినిమాకే మనోడు మంచి మాస్ సినిమాతో వస్తున్నాడు. ఆగష్టు 11న రాబోతున్న ఈ సినిమా ఫలితం ఎలా ఉండబోతుందో చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news