గతేడాది కరోనా తర్వాత ఇండస్ట్రీలో వరుస పెట్టి పెళ్లిళ్లు అవుతున్నాయి. చాలా యేళ్ల నుంచి పెళ్లికి దూరంగా ఉన్న బ్యాచిలర్ హీరోలు అందరూ ఠక్కున పెళ్లి చేసేసుకుంటున్నారు. టాలీవుడ్ లో అయితే దగ్గుబాటి రానా, నిఖిల్, నితిన్ ఇలా వరుస పెట్టి తమ ప్రియురాళ్ల మొడలో మూడు ముళ్లు వేసి ఓ ఇంటి వాళ్లు అయిపోయారు. అటు బాలీవుడ్‌లోనూ కొందరు ఓ ఇంటివాళ్లు అయ్యారు. ఈ పరంపర కొనసాగుతూనే వస్తోంది. తాజాగా ఓ బాలీవుడ్ డైరెక్టర్ కూడా తన ప్రియురాలిని పెళ్లాడబోతున్నాడు.
ప్యార్ కా పంచనామా డైరెక్టర్ లవ్ రంజన్ త్వరలో ఓ ఇంటివాడు అవుతున్నాడు. అతడు త్వరలోనే తన ప్రేయసితో వైవాహిక జీవితాన్ని స్టార్ట్ చేయబోతున్నాడు. ఫిబ్రవరి 18 నుంచి ఈ పెళ్లి పనులు స్టార్ట్ అవుతాయని.. ఈ నెల 20న వివాహ వేడుక ఉంటుందని తెలుస్తోంది. అందుకే ప్రస్తుతం లవ్ రంజన్ దర్శకత్వం వహిస్తోన్న రణబీర్ కపూర్ – శ్రద్ధా కపూర్ సినిమా షూటింగ్‌కు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చినట్టు బీ టౌన్‌లో ప్రచారం నడుస్తోంది.
లవ్ రంజన్ , అతడికి కాబోయే భార్య ఇప్పటికే వెడ్డింగ్ డ్రెస్ కోసం ఫ్యాషన్ డిజైనర్ మనీశ్ మల్హోత్రాను సంప్రదించడంతో పాటు వారికి నచ్చిన విధంగా కాస్ట్యూమ్స్ కూడా రెడీ చేసుకున్నారట. వాస్తవానికి వీరి పెళ్లి జనవరిలోనే జరగాల్సి ఉంది. అయితే కరోనా ఒమిక్రాన్ కేసులు పెరగడంతో వాయిదా పడక తప్పలేదు. ఇక లవ్ రంజన్ ప్యార్ కా పంచానామ – సోనూ కీ టీటూ కి స్వీటీ – దేదే ప్యార్ దే – ఆకాశవాణి సినిమాలతో బాగా పాపులర్ అయ్యాడు.