టాలీవుడ్ యంగ్‌టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో నటించిన త్రిబుల్ ఆర్ సినిమా కోసమే ఎన్టీఆర్ మూడేళ్లు వెయిట్ చేశాడు. ఐదు సూపర్ హిట్ సినిమాల తర్వాత ఒక్క సినిమాకు ఏకంగా ఒకటి కాదు రెండు కాదు.. మూడేళ్లు కేటాయించేశాడు. దీనికి తోడు కరోనా రెండు సార్లు రావడం.. త్రిబుల్ ఆర్ రిలీజ్ లేట్ అవ్వడంతో ఎన్టీఆర్ మరో ప్రాజెక్టు మీద కాన్సంట్రేషన్ చేయలేదు. త్వరలోనే కొరటాల శివ షూటింగ్లో జాయిన్ అవుతోన్న ఎన్టీఆర్ చేతిలో మరో మూడు నాలుగు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, బుచ్చిబాబు సానా వీళ్లంతా ఎన్టీఆర్ లైనప్‌లో ఉన్నారు. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాలతో చేస్తోన్న సినిమాకు ఎన్టీఆర్ అన్న కళ్యాణ్‌రామ్ నిర్మాతగా ఉన్నారు. గతంలో కళ్యాణ్‌రామ్ బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్‌లో జై లవకుశ సినిమా చేశారు. ఇప్పుడు మరోసారి నిర్మాత మిక్కిలినేని సుధాకర్‌తో కలిసి ఎన్టీఆర్ అన్న కోసం మరో సినిమా చేస్తున్నాడు.
ఇదిలా ఉంటే కళ్యాణ్‌రామ్ ప్రస్తుతం బింబిసార సినిమా చేస్తున్నాడు. రెండు పార్టులుగా తెరకెక్కే ఈ సినిమా ఫస్ట్ పార్ట్ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయ్యింది. వశిష్ట్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో కళ్యాణ్‌రామ్ బార్బేరియన్ కింగ్‌గా కనిపిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. కళ్యాణ్‌రామ్ కెరీర్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా సెకండ్ పార్ట్‌లో జూనియర్ ఎన్టీఆర్ గెస్ట్ రోల్లో కనిపిస్తారట.
ఎన్టీఆర్ కథను మలుపు తిప్పే ఓ కీలక పాత్రలో కనిపిస్తారట. ఈ పాత్ర సినిమాకు హైలెట్ అవుతుందని అంటున్నారు. గతంలోనే కళ్యాణ్‌రామ్ – ఎన్టీఆర్ కాంబోలో సినిమా రావాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ కాంబినేషన్ పట్టాలు ఎక్కలేదు. ఇక ఈ అన్నదమ్ములు ఇద్దరిని ఒకేసారి స్క్రీన్ మీద చూడాలన్న కోరిక బింబిసారతో అయినా నెరవేరుతుందేమో ? చూడాలి.