టాలీవుడ్ యంగ్‌టైగర్ ఎన్టీఆర్ డబుల్ హ్యాట్రిక్ హిట్‌కు రెడీ అవుతున్నారు. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన ప్రెస్టేజియస్ ప్రాజెక్టు త్రిబుల్ ఆర్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. రు. 450 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా మూడేళ్ల నుంచి షూటింగ్‌లోనే ఉంది. కరోనా రెండు సార్లు రావడంతో త్రిబుల్ ఆర్ రిలీజ్‌కు సరైన డేట్ దొరకలేదు. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. జై లవకుశ సినిమా తర్వాత ఎన్టీఆర్ అన్న కళ్యాణ్‌రామ్ ఎన్టీఆర్ హీరోగా నిర్మిస్తోన్న సినిమా ఇదే. ఇందులో కొరటాలకు అత్యంత సన్నిహితుడు అయిన మిక్కిలినేని సుధాకర్ కూడా నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు.
ఇక ఎన్టీఆర్ అభిమానులకు మరో అదిరిపోయే న్యూస్ వచ్చేసింది. కొరటాల సినిమా తర్వాత ఎన్టీఆర్ ఒకేసారి రెండు సినిమాలు చేస్తున్నాడు. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సానా ఎన్టీఆర్ కోసం అదిరిపోయే కథ రెడీ చేసుకున్నాడు. యేడాది కాలంగా ఇదే కథపై వర్కవుట్ చేస్తున్నాడు. కొరటాల తర్వాత ఎదోలా తన సినిమాను పట్టాలెక్కించేందుకు బుచ్చిబాబు కసితో పని చేస్తున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్‌ను కలిసి కథ మెయిన్ లైన్ కూడా చెప్పేశాడు.
గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కే ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ పరిశీలనలో ఉందన్న వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర చాలా స్పెషల్‌గా ఉంటుందట. ఎన్టీఆర్ ఓ లోపంతో బాధపడుతూ ఉంటాడని.. అయితే అదే లోపం ఎన్టీఆర్‌కు వరంగా మారుతుందట. బుచ్చిబాబు అదిరిపోయే ట్విస్టులతో సినిమాను రెడీ చేసినట్టు చెపుతున్నారు.
ఇక బుచ్చిబాబు సినిమాకు సమాంతరంగానే ప్రశాంత్ నీల్ సినిమాలో కూడా ఎన్టీఆర్ నటిస్తాడట. ఒకే సారి రెండు సినిమాలు నడుస్తాయట. ప్రశాంత్ నీల్ సినిమా భారీ పాన్ ఇండియా సినిమా కావడంతో ఈ సినిమాకు కాస్త ఎక్కువ రోజులు షూటింగ్ చేయాల్సి ఉంది. అందుకే బుచ్చిబాబు సినిమాతో పాటు ప్రశాంత్ నీల్ సినిమా కూడా ఒకేసారి చేసేందుకు ఎన్టీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశాడు.
ఇక ఈ యేడాది త్రిబుల్ ఆర్‌తో పాటు కొరటాల శివ సినిమాలు రిలీజ్ అవుతాయి. అలాగే 2023లో కూడా బుచ్చిబాబు, ప్రశాంత్ నీల్ సినిమాలు రిలీజ్ అవుతాయి. ఏదేమైనా ఎన్టీఆర్ అభిమానులకు ఈ రెండేళ్లు నాలుగు సినిమాలతో మామూలు సంబరం కాదనే చెప్పాలి.