టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ఫ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఇప్పుడు బన్నీకి ఏకంగా ఐకాన్‌స్టార్ అన్న కొత్త బిరుదు కూడా వచ్చేసింది. అల్లు అర్జున్‌కు ఐకాన్ స్టార్ అన్న పేరు బాగా సెట్ అవుతుందని పుష్ప దర్శకుడు సుకుమార్ కూడా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తాజాగా వచ్చిన పుష్ప ఎలాంటి అంచనాలు లేకపోయినా కూడా బాలీవుడ్లో ఏకంగా రు. 100 కోట్ల వసూళ్లు సాధించింది. బన్నీకి ఇప్పటి వరకు తెలుగు తర్వాత మల్లూవుడ్‌లో ఆ రేంజ్లో మార్కెట్ ఉండేది. అలాంటిది పుష్ప బాలీవుడ్లో రు. 100 కోట్లు కొల్లగొట్టడంతో ఇప్పుడు అందరూ షాక్ అవుతున్నారు.
బన్నీ మానియా ఏంటో స్టార్ హీరోలకు కూడా అర్థం కావడం లేదు. ప్రస్తుతం బన్నీ పుష్ప 2 సినిమా చేస్తున్నాడు. టాలీవుడ్‌లోని బెస్ట్ డ్యాన్సర్లలో బన్నీ కూడా ఒకరు. ఆర్య, ఆర్య 2 సినిమాల తర్వాత బన్నీ డ్యాన్సులు చూసి యూత్‌కు పిచ్చెక్కిపోతోంది. రేసుగుర్రం, దేశముదురు, నాపేరు సూర్య సినిమాల్లో కూడా బన్నీ వేసిన స్టెప్పులు యూత్‌ను ఫిదా చేసేశాయి. బన్నీ డ్యాన్స్‌కు మైమరచిపోయే లక్షలాది మంది యువత అభిమానులు అయిపోతున్నారు.
ఇదిలా ఉంటే అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ నటించిన ఓ సినిమాకు కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. ఈ విషయం తక్కువ మందికే తెలుసు. పవన్ కళ్యాణ్ హీరోగా బసవా వీరశంకర్ దర్శకత్వంలో గుడుంబా శంకర్ సినిమా వచ్చింది. 2004లో వచ్చిన ఈ సినిమాలో పాటలు అన్నీ సూపర్ హిట్. ఈ సినిమాకు నాగబాబు నిర్మాత. పవన్‌కు జోడీగా మీరాజాస్మిన్ నటించింది.
ఈ సినిమాలో చిగురాకు చిలకా సాంగ్ అంటే అందరికి ఇష్టమే. ఈ పాటకే అల్లు అర్జున్ కొరియోగ్రఫీ చేశారు. అయితే ఈ విషయం తక్కువ మందికే తెలుసు. అలాగే మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేష్‌కృష్ణ దర్శకత్వంలో వచ్చిన డాడీ సినిమా 2001లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో ఓ డ్యాన్స్ బిట్ ఉంటుంది. ఈ బిట్లో అల్లు అర్జున్ కళ్లు చెదిరే స్టెప్పులు వేసి అందరికి ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత 2003లో గంగోత్రి సినిమాతో హీరో అయ్యాడు.