దర్శకధీరుడు రాజమౌళి చాలా మృదుస్వభావి.. తనకు పరిచయం ఉన్న వారు సినిమా ప్రమోషన్స్ లో సాయం అడిగితే కాదనకుండా చేసే వ్యక్తి. తన అసిస్టెంట్ సినిమా తీసినా సరే ఆడియో రిలీజ్ కు వెళ్లి తన విశెష్ అందచేస్తాడు. ఈ క్రమంలో రాజమౌళిలో ఈ మంచి తనమే తనకు చెడ్డ పేరు తెస్తుందని అంటున్నారు. ఎందుకు ఎలా అంటే రాజమౌళి అంటే ఓ బ్రాండ్.. ఆయన టిక్ మార్క్ వేస్తే అది సూపర్ అన్నట్టే. అలాంటి రాజమౌళి ఈమధ్య మొహమాటానికి పోయి బాగాలేకున్నా సరే బాగుంది అంటూ ప్రమోట్ చేయడం సిని జనాలకు నచ్చట్లేదు.
రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన జగపతి బాబు సినిమా పటేల్ సర్. వాసు పరిమి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా నిర్మాత సాయి కొర్రపాటి. ఈగ సినిమా ఆలోచనని అంతగా నమ్మాడని చెప్పి సాయి కొర్రపాటి అంటే జక్కన్నకు ఎక్కడ లేని అభిమానం, ఆ అభిమానంతోనే తను తీసే ప్రతి సినిమాకు రాజమౌళిని వాడుతుంటాడు.
ఇక పటేల్ సర్ విషయంలో కూడా రాజమౌళి వేసిన ట్వీట్ ఆడియెన్స్ ను థియేటర్లకు రప్పించాయి. తీరా సినిమా చూస్తే రొటీన్ స్టోరీ.. రొటీన్ రచ్చే అని తెలిసింది. అయితే సినిమా తీసిన వారిని అనకుండా ముందు ఈ సినిమాను ప్రమోట్ చేసిన జక్కన్నపై కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు. రాజమౌళి చెప్పాడు కదా అని సినిమాకెళ్తే ఇలా ఉందేంటి అంటూ చర్చించుకుంటున్నారు. మరి ఈ విషయాలను రాజమౌళి గమనించి ఇకముందు ఇలా చేయకుండా ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.