టాలీవుడ్ చరిత్రను దేశం ఎల్లలు దాటించేసి ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన ఘనత దర్శకధీరుడు రాజమౌళికే దక్కుతుంది. బాహుబలి సీరిస్ సినిమాల తర్వాత రాజమౌళి పేరు ఇప్పుడు జాతీయస్థాయిలో మార్మోగిపోతోంది. ప్రస్తుతం రాజమౌళి ఎన్టీఆర్ – రామ్‌చరణ్ కాంబినేషన్లో తెరకెక్కిస్తోన్న మల్టీస్టారర్ మూవీ ఆర్ ఆర్ ఆర్ మార్చి 25న వరల్డ్ వైడ్‌గా 14 భాషల్లో రిలీజ్ కానుంది.
టాలీవుడ్ చరిత్రలో ఓటమి లేని డైరెక్టర్‌గా రాజమౌళికి ఎంత పాపులార్టీ ఉందో ఆయన సినిమాలకు రిలీజ్‌కు ముందే వస్తోన్న క్రేజ్ చెపుతోంది. కొందరు స్టార్ హీరోలకు పాన్ ఇండియా ఇమేజ్ రావడానికి పరోక్షంగా రాజమౌళీయే కారణం అన్నది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక సినిమా సినిమాకు ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎవ్వరికి అందనంత ఎత్తులోకి వెళుతోన్న రాజమౌళి రెమ్యునరేషన్ కూడా అదే రేంజ్‌లో పెరిగిపోతోంది.
ఇదిలా ఉంటే రాజమౌళితో సినిమా ఒప్పుకుంటే ఎంత పెద్ద హీరో అయినా, ఎంత పెద్ద టెక్నీషియన్ అయినా చాలా కఠినమైన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఎవ్వరికి మినహాయింపు ఉండదు. తన సినిమాలు పూర్తయ్యేవరకు తన హీరో, టెక్నీషియన్లు మరే సినిమాలో నటించకూడదు అన్న కండీషన్లు ఆయన పెడతారు. ఆయన సినిమాకు పనిచేసే హీరో లెక్కలేనన్ని కాల్షీట్లు ఇవ్వాలి.
ఇక సినిమా షూటింగ్‌కు, సెట్స్‌కు వచ్చే వారు అందరూ తప్పనిసరిగా ఐడెంటీ కార్డులు వేసుకురావాలి.. ఈ రూల్ రాజమౌళికి కూడా వర్తిస్తుంది. ఇక ఆ సినిమా స్టార్ట్ అయ్యి పూర్తయ్యే వరకు యేడాది అయినా.. రెండు సంవత్సరాలు అయినా కూడా అప్పటి వరకు మరోసినిమా చేయకూడదు. సెట్స్‌లోకి సెల్‌ఫోన్లు కూడా తీసుకురాకూడదు.. ఎవరికి అయినా ఇంపార్టెంట్ అయితే అక్కడ ఉన్న ఫోన్ నుంచే కాల్స్ చేసుకోవాలి.. ఇలా చాలా రూల్స్ ఉంటాయి.
ప్రముఖ రచయిత జొన్నవిత్తుల సైతం రాజమౌళితో సినిమా అంటే ఎన్ని కండీషన్లో చెప్పకనే చెప్పారు. బాహుబలి సినిమా ఎందుకు వదులుకున్నానో ? కూడా ఆయన చెప్పారు. ముందు బాహుబలి సినిమాకు తాను డైలాగులు రాయాలని తన పేరును విజయేంద్రప్రసాద్ సూచించారని… ఈ క్రమంలోనే తాను స్టోరీ డిస్కషన్ కోసం రెండున్నర నెలలు కూడా వెళ్లానని రామలింగేశ్వరరావు చెప్పారు.
అయితే సినిమా పూర్తయ్యే వరకు.. రెండున్నర సంవత్సరాలు వాళ్లతోనే ఉండాలని రాజమౌళి, విజయేంద్రప్రసాద్ చెప్పడంతో తాను ఆ సినిమా ఛాన్స్ వదులుకున్నానని ఆయన చెప్పారు. ఆ సినిమా కోసం అంత టైం కేటాయిస్తే తాను కొన్ని సభలకు కూడా వెళ్లడం కుదరదు అని.. అందుకే తాను ఈ సినిమా ఛాన్స్ వదులుకున్నానని అయితే.. ఆ సినిమాకు కొన్ని రోజులు పనిచేసినందుకు గాను తనకు కొంత రెమ్యునరేషన్ కూడా ఇచ్చినట్టు ఆయన చెప్పారు.