టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా గుడ్ లక్ సఖీ. తెలుగు వాడు అయిన నగేష్ కుకూనూర్ తెరకెక్కించిన సినిమా కావడంతో ఈ సినిమాపై రిలీజ్‌కు ముందు కాస్త మంచి అంచనాలు ఉన్నాయి. నగేష్ కుకూనూర్ అంతర్జాతీయ స్థాయిలో సినిమాలు తీసి అవార్డులు అందుకున్నారు. ఇప్పుడు కీర్తి సురేష్ లాంటి మెయిన్ హీరోయిన్ను ప్రధాన పాత్రలో పెట్టి ఈ సినిమా తెరకెక్కిస్తూ ఉండడంతో ఏదో సంచలనం చేయబోతున్నారా ? అని అందరూ అనుకున్నారు.
దిల్ రాజు హ్యాండ్ పడడంతో పాటు జగపతిబాబు, ఆది పినిశెట్టి కీలక పాత్రల్లో కనిపించడంతో గుడ్ లక్ సఖీ సంచలనం నమోదు చేస్తుందన్న అంచనాలు ఉన్నాయి. కట్ చేస్తే ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఫస్ట్ షో చూసిన జనాలకు నోట మాట రాలేదు. 20 ఏళ్ల క్రితం అవుట్ డేటెడ్ కథ, కథనాలతో అసలు ఈ సినిమా ఎలా తీశార్రా బాబు అని తలలు పట్టుకున్నారు.
బ్యాడ్‌లక్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ఓ తండా అమ్మాయి సఖీ జాతీయ స్థాయి షూటర్‌గా ఎలా ? ఎదిగింది అన్న నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక ఈ సినిమా రెండు రోజుల వసూళ్లు దారుణంగా ఉన్నాయి. అసలు వీటి గురించి చర్చించుకోవడం కూడా టైం వేస్ట్. తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో రు. 13 లక్షల షేర్, వరల్డ్ వైడ్‌గా రు. 15 లక్షల షేర్ మాత్రమే రాబట్టింది. ఇక రెండో రోజు రు. 10 లక్షల షేర్ కూడా రాలేదు.
రెండు రోజులకు ఓవరాల్‌గా చూస్తే వరల్డ్ వైడ్‌గా రు. 26 లక్షల షేర్ ( ఏపీ, తెలంగాణలో రు. 23 లక్షలు), రు. 50 లక్షల గ్రాస్ వసూల్లు మాత్రమే సాధించింది. ఇక ఈ సినిమా నిర్మాతలకు భారీనష్టాలు తప్పేలా లేవు. అదే టైంలో ఈ సినిమాను డిజాస్టర్‌కు డిక్షనరీ అర్థంలో పెట్టేయవచ్చన్న సెటైర్లు సోషల్ మీడియాలో పేల్చుతున్నారు.