టాలీవుడ్ యంగ్‌టైగర్ ఎన్టీఆర్ కెరీర్‌లోనే ఓ అరుదైన రికార్డుకు చేరువ అవుతున్నాడు. ఇప్పటికే ఐదు వరుస హిట్లు తన ఖాతాలో వేసుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు త్రిబుల్ ఆర్ కూడా హిట్ అయితే డబుల్ హ్యాట్రిక్ కొట్టిన ఈ తరం జనరేషన్ హీరోగా నిలిచిపోనున్నాడు. ఈ తరం జనరేషన్ హీరోల్లో వరుసగా ఆరు హిట్లు ఎవ్వరికి లేవు. అసలు వరుసగా మూడు హిట్లు రావడమే గగనం అవుతోంది. అలాంటిది ఇప్పుడు ఏకంగా ఆరు వరుస హిట్లు అంటే మామూలు క్రేజ్ కాదు.
త్రిబుల్ ఆర్ కంప్లీట్ చేసిన ఎన్టీఆర్ ఇప్పుడు కొరటాల శివ తెరకెక్కించే సినిమాలో నటిస్తున్నాడు. యువసుధా ఆర్ట్స్ – ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. పాన్ ఇండియా రేంజ్‌లో ఈ క్రేజీ ప్రాజెక్టు తెరకెక్కుతోంది. త్రిబుల్ ఆర్ తర్వాత వచ్చే పాన్ ఇండియా ఇమేజ్‌ను ఈ సినిమాతో కంటిన్యూ చేయాలని ఎన్టీఆర్ ప్లానింగ్‌తో ఉన్నాడు.
ఇక ఈ సినిమా ఓ పొలిటికల్ లీడర్‌గా కనిపిస్తాడు అన్న మాట ఇప్పుడు తారక్ అభిమానులను కాస్త టెన్షన్ పెడుతోంది. సినిమా మెయిన్ లైన్ అయితే పొలిటికల్ యాంగిల్లో ఉంటుందన్న టాక్ బయటకు వచ్చేసింది. ఎన్టీఆర్ ఆది, స్టూడెంట్ నెంబర్ వన్ లాంటి హిట్లతో జోరుమీదున్నప్పుడు నాగ సినిమా చేసి పెద్ద మిస్టేక్ చేశాడు. తారక్ వయస్సుతో పోలిస్తే అది బరువైన పాత్ర అన్న టాక్ వచ్చింది.
స్టూడెంట్స్, రాజకీయాలు, ముఖ్యమంత్రి అంటూ హైఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా నాగ నడుస్తుంది. ఏఎం. రత్నం శ్రీ సూర్యా మూవీస్ బ్యానర్‌పై 2003లో ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. ఆ తర్వాత జనతా గ్యారేజ్‌లో విద్యార్థిగా కనిపించాడే తప్పా విద్యార్థి నాయకుడిగా కాదు. అయితే ఇప్పుడు మళ్లీ ఎన్టీఆర్ నాయకుడిగా కనిపిస్తాడు… పొలిటికల్ నేపథ్యంలోనే కొరటాల సినిమా కథ ఉంటుందని చెప్పడంతో తారక్ అభిమానులు కాస్త టెన్షన్ పడుతున్నారు.
ఎన్టీఆర్‌కు బలమైన పొలిటికల్ నేపథ్యం ఉంటుంది… సినిమాలో కూడా కథా పరంగా కాంట్రవర్సీ లేకుండా చూసుకోవాలి. అటు ఎన్టీఆర్ ఇమేజ్ బ్యాలెన్స్ చేయాలి.. మరి కొరటాల ఈ లైన్‌తో సినిమాను ఎలా హిట్ చేస్తాడు ? తారక్ నటనా పరంగా కొత్తగా ఎలా ట్రై చేస్తాడు ? అన్నది చూడాలి.