పదేళ్ల క్రితం దేశంలో పెద్ద సినిమా ఇండస్ట్రీ ఏది అని అంటే అందరి నోటా వినిపించే ఒకే ఒక్క మాట బాలీవుడ్. బాలీవుడ్ హీరోల రెమ్యునరేషన్లు కోట్లలో ఉండేవి. అయితే పదేళ్లలో సీన్ రివర్స్ అయ్యింది. ఖాన్ ల క్రేజ్ తల్లకిందులు అయ్యింది. ఇప్పుడు తెలుగు సినిమా మార్కెట్ నేషనల్ వైడ్‌గా పెరిగిపోయింది. తెలుగు సినిమాలను సౌత్ టు నార్త్ అందరూ నెత్తిన పెట్టుకుంటున్నారు. రాజమౌళి బాహుబలి సినిమా తర్వాత తెలుగు సినిమాలకు నార్త్‌లో విపరీతంగా క్రేజ్ పెరిగిపోయింది.
ప్రభాస్ సాహో సినిమా తెలుగులో అంతంత మాత్రంగా ఆడితే బాలీవుడ్‌లో హిట్ అయ్యింది. ఈ క్రమంలోనే మన తెలుగు స్టార్ హీరోల రెమ్యునరేషన్లు కూడా ఇప్పుడు పదింతలు పెరిగిపోయాయి. మన స్టార్ హీరోలు పదేల్ల క్రితం ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారు.. ఇప్పుడు ఎంతెంత వసూలు చేస్తున్నారో చూద్దాం.
ప్రభాస్:
యంగ్‌రెబల్‌స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు రు. 100 కోట్ల పైనే రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. పదేళ్ల క్రితం మిస్టర్ ఫర్‌ఫెక్ట్, డార్లింగ్ సినిమాలకు రు. 5 కోట్లు మాత్రమే తీసుకునేవాడు.
జూనియర్ ఎన్టీఆర్:
టాలీవుడ్ యంగ్‌టైగర్ జూనియర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమా కోసం రు. 50 కోట్లు తీసుకున్నాడట. ఈ సినిమా కోసమే ఏకంగా మూడేళ్లు వెయిట్ చేశాడు. అయితే పదేళ్ల క్రితం రభస, రామయ్యా వస్తావయ్యా లాంటి సినిమాలకు రు. 6 కోట్లు తీసుకున్నాడు.
మహేష్‌బాబు:
సూపర్‌స్టార్ మహేష్‌బాబు తన సినిమాలకు తానే కో ప్రొడ్యుసర్‌గా ఉంటున్నాడు. ఖలేజా, దూకుడు సినిమాల టైంలో ఒక్కో సినిమాకు రు. 8 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడు. సగటున ఇప్పుడు మహేష్ ఒక్కో సినిమాకు రు. 60 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టుగా ఉంది.
పవన్ కళ్యాణ్ :
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు రు. 60 కోట్ల పైన.. ఇంకా చెప్పాలంటే ఒక్కోసారి పవన్‌కు రు. 70 కోట్లు కూడా ముడుతున్నాయంటున్నారు. అదే కొమరంపులి టైంలో పవన్ ఒక్కో సినిమాకు రు. 7.5 నుంచి రు. 8 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునేవాడు.
అల్లు అర్జున్:
పుష్పతో పాన్ ఇండియా స్టార్ అయిపోయిన అల్లు అర్జున్ ఇప్పుడు ఒక్కో సినిమాకు రు. 40 నుంచి రు. 50 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట. ఇంతకు ముందు వరకు కూడా బన్నీ రు. 30 కోట్ల రేంజ్‌లో ఉండేవాడు. కానీ పదేళ్ల క్రితం వరుడు, వేదం సినిమాలకు రు. 6 కోట్లు తీసుకునేవాడు.
ఏదేమైనా తెలుగు సినిమాలకు పాన్ ఇండియా రేంజ్‌లో మార్కెట్ పెరగడంతో ఇప్పుడు మన హీరోల రెమ్యునరేషన్లు కూడా పది రెట్లు పెరిగిపోయాయి. ఇక సౌత్, నార్త్ డబ్బింగ్ రైట్స్‌తో పాటు శాటిలైట్ రైట్స్ కూడా పెరగడంతో హీరోలు కూడా ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు.