తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో హిమజ ఇప్పుడు ఓ టాప్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా దూసుకుపోతున్నారు. సినిమాల్లో అప్పుడప్పుడు మంచి సపోర్టింగ్ రోల్స్ చేసుకుంటోన్న టైంలో ఆమె ఎప్పుడు అయితే బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిందో అప్పటి వరకు హిమజ అంటే తెలియని వాళ్లకు కూడా బాగా తెలిసిపోయింది. బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లడం హిమజ కెరీర్‌కు చాలా ప్లస్ అయ్యిందనే చెప్పాలి. ఆ తర్వాత ఆమె బుల్లితెరపై కూడా పలు షోలకు వ్యాఖ్యాతగా చేస్తూ తన ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది.
తాజాగా హిమజ టెన్త్‌క్లాస్ డైరీస్ సినిమాలో కూడా ఓ కీలక పాత్రలో నటించింది. ఇక 2015లో శివమ్ సినిమాతో ఆమె వెండితెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత ధృవ – మహానుభావుడు – స్పైడర్ – నేను శైలజ – చుట్టలబ్బాయ్ – జనతా గ్యారేజ్ – వినయ విధేయ రామ – సినిమాల్లో చేసింది. ఇటీవల రిలీజ్ అయిన వరుడు కావలెను సినిమాలో కూడా హిమజ పాత్రలో బాగా కామెడీ పండించిందన్న ప్రశంసలు వస్తున్నాయి.
ఇటు బుల్లితెరపై కూడా హిమజ పాపులరే. 2013లో భార్యమణి అనే సీరియల్‌తో ఆమె సీరియల్ నటిగా పరిచయం అయ్యింది. స్వయంవరం, సూపర్ 2, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, కెవ్వు కబడ్డీ లాంటి సీరియల్స్ ద్వారా ఆమె పాపులర్ అయ్యింది. ఇదిలా ఉంటే తాజాగా హిమజకు సంబంధించి ఓ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హిమజ రెండు పెళ్లిళ్లు చేసుకుందని.. ప్రస్తుతం రెండో భర్త తో కూడా విడాకులు తీసుకుంటుందన్న న్యూస్ బాగా వైరల్ అవుతోంది.
ఈ వార్తపై హిమజ ఓ వీడియోలో స్పందించింది. చాలా మంది నాకు యూట్యూబ్ లింక్స్, ఆర్టికల్స్ లింకులు షస్త్రర్ చేస్తున్నారు.. దయచేసి నా పెళ్లికి నన్ను పిలవాలని.. అలాగే నా విడాకులకు కూడా నన్ను పిలవాలని కోరింది. నాకు తెలియకుండానే యూట్యూబ్‌లో పెళ్లిళ్లు చేసేస్తున్నారని.. యూట్యూబ్‌లో నాకు విడాకులు ఇచ్చేస్తున్నారని.. ఇలాంటి ఫేక్‌న్యూస్‌ను తాను పెద్దగా పట్టించుకోనని హిమజ ఘాటుగా స్పందించింది. అయితే ఈ ఫేక్‌న్యూస్‌పై తన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారని.. ఇలాంటివి ప్రచారం చేయవద్దని ఆమె విజ్ఞప్తి చేసింది.