అవును. అన్నీ దేవుళ్లలోకి వినాయకుడే ఎక్కువే పాపం చేశాడా. ఏమో చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రతిమలు చూస్తుంటే అయ్యో అన్పిస్తుంది. సహజంగానే తెలుగు నేలపై అభిమానం పాళ్లు ఎక్కువ. చాలామంది తమకు నచ్చిన నాయకుడిని దేవుళ్లగా పూజించే వీరభక్తుల్ని చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఎన్టీఆర్, ఎఎన్నార్ అడపా దడపా కృష్ణ ను కూడా తమకు నచ్చిన దేవుళ్ల రూపంలో కొలుచుకున్నారు అప్పటి అభిమానులు.
అయితే ఇప్పుడొచ్చిన చిక్కల్లా ఈ అభిమానం రాజకీయ నాయకులు పాకడమే. ఈ మధ్యనే తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు చంద్రులను దేవుళ్లతో కీర్తీస్తూ పెట్టిన కటౌట్లు చూసే ఉంటారు. వీటిని చూసినప్పుడల్లా ఎబ్బెట్టుగా అనిపించినా మనకు భరించక తప్పడంలేదు. ఆమధ్య గోదావరి పుష్కరాల టైమ్ లో ఎన్టీఆర్ ను కృష్ణుడి వేశంలో ఉంచిన విగ్రహ ప్రతిష్టాపనపై విమర్శలను చూశాం.
ఇప్పుడు ఏపీ చంద్రబాబు అభిమానులు ఓ అడుగు ముందుకు వేశారు. తమ పిచ్చి అభిమానాన్ని చాటుకోడానికి వినయక ఉత్సవాలను వేదికగా చేసుకున్నారు. ఆంధ్రలో ఓచోట వినాయకుని విగ్రహంతో పాటు చంద్రబాబు విగ్రహాన్ని కూడా పెట్టి పూజలు చేస్తున్నారు. ఇలాంటివి చూసినప్పుడే వేగటుగా అన్పిస్తున్నాయి. మీకు అంతగా భక్తి ఉంటే నాయకుల విగ్రహాలు పెట్టుకుని పూజించుకోండి కానీ ఇదేంటని ప్రశ్నిస్తున్నారు భక్తులు.
అభిమాన నాయకులను దేవుళ్లుగా చేసి జనంలోకి వచ్చినప్పుడు సమస్యలు తప్పడంలేదు. ఇలా చేయడం భక్తుల విశ్వాసాలను, మనోభావాలను కించపరచడం కాదా? క్రియేటర్స్ మూర్ఖత్వానికి వినాయక ఉత్సవాలు కేరాఫ్ కావడం బాధ కలిగిస్తోంది. బహుశా గణేష్ బొమ్మపై జరిగినన్ని ప్రయోగాలు ఇంకెవరిపైనా జరగలేదేమో. కార్టూన్లు, టీవీ ప్రొగ్రామ్స్, వ్యంగాలు, పెయింటింగ్స్, మూవీస్ ఇలా అన్నింట్లోనూ గణేషుడి రూపంపై ప్రయోగాలే. ఇలా ఎవరికి తోచిన విధంగా వాళ్లు గణేషుడి రూపం మారుస్తున్నారు.