Moviesపాపం..కోట్లు ఉన్నా ఆ కలని నెరవేర్చుకోలేకపోతున్న అక్కినేని ఫ్యామిలీ..?

పాపం..కోట్లు ఉన్నా ఆ కలని నెరవేర్చుకోలేకపోతున్న అక్కినేని ఫ్యామిలీ..?

ప్రస్తుత పరిస్ధితులు చూస్తుంటే అక్కినేని ఫ్యామిలీకి గుడ్ లక్ నడుస్తున్నట్లు ఉంది అంటున్నారు సినీ విశ్లేషకులు. అక్కినేని అంటే ఓ స్దాయిని సెట్ చేసాడు నాగేశ్వరరావు గారు. ఆ పేరుకి ఏమాత్రం చెడ్డ పేరు రాకుండా ఇన్నాళ్లు కాపాడుకుంటూ వచ్చారు ఆయన వారసుడిగా నాగార్జున. ఇప్పుడు ఆయన కొడుకుల వంతు వచ్చింది. అక్కినేని నాగార్జున వారసులుగా నాగచైతన్య, అఖిల్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తాత,నాన్న తెచ్చుకున్నంత పేరు తెచ్చుకోలేకపోతున్నారు. నాగచైతన్య ఖాతాలో అయిన కొన్ని హిట్ సినిమాలు పడ్డాయి కానీ అఖిల్ గురించి అయితే అసలు చెప్పనవసరం లేదు.

మొన్నటి వరకు ఒక్క హిట్ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. ఈ మధ్యనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమాతో కెరీర్ లో మొదటి సక్సెస్ ను రుచి చూసిన ఈయన..ఇప్పుడు ఏజెంట్ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వెసుకొవడానికి రెడీగా ఉన్నాడు. అయితే , ప్రతుతం ఉన్న హీరోలందరు..పాన్ ఇండియా మూవీలని, 100 కోట్ల క్లబ్ లో చేరిపోతుంటే..స్టార్ హీరో కొడుకు అయ్యి నాగచైతన్య ఇంకా 30,40 కోట్ల క్లబ్ లోనే ఉండిపోయాడు. ఏదో బంగార్రాజు పుణ్యామా అంటూ తండ్రి కొడుకులు ఇద్దరు 50కోట్ల క్లబ్ లో చేరారు. కానీ అక్కినేని ఫ్యాన్స్ కు కావాల్సింది ఇది కాదు..ప్రభాస్,చరణ్,అల్లు అర్జున్,లాగా చైతన్య ,అఖిల్ కూడా 100కోట్ల క్లబ్ లో చేరాలి.

అదే అక్కినేని నాగార్జున కల కూడా..కానీ ఇప్పటి వరకు చై కు అలాంటి హిట్ సినిమానే పడలేదు. ఇక ఈ వయసులో నాగార్జున అలాంటి సినిమాలు చేయడం అంటే క్ష్టమే. పోనీ అఖిల్ అయిన ఆస్దాయి కి చేరుతాడా అంటే ప్రస్తుతం ఉన్న పరిస్ధితుల్లో అది చాలా కష్టం అనే చెప్పాలి. ఇక అక్కినేని అభిమానుల ఆశలని నాగచైతన్య పైనే పెట్టుకుని ఉన్నారు. అక్కినేని పేరిట ఎన్ని ఆస్తులు ఉన్న ఆయన వారసులు 100కోట్ల క్లబ్ లో చేరారు అంటే ఫ్యాన్స్ కు ఇంతకన్నా హ్యాపీ న్యూస్ మరోకటి ఉండదు. మరి చూడాలి అక్కినేని అభిమానుల కల ఎప్పుడు నెరవేరుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news