Moviesఆ విషయంలో యూటర్న తీసుకున్న సమంత ..పిల్లల కోసమే అంటూ కొత్త...

ఆ విషయంలో యూటర్న తీసుకున్న సమంత ..పిల్లల కోసమే అంటూ కొత్త ప్రయత్నం..!!

టాలీవుడ్ మోస్ట్ రొమాంటిక్ కపుల్ అయిన సెలబ్రిటీ జంట సమంత, అక్కినేని నాగచైతన్య వేరుకుంపటి పెట్టుకునేందుకు నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. దీంతో టాలీవుడ్ సినీ పరిశ్రమే కాదు అటు బాలీవుడ్ ఇటు కోలీవుడ్ రెండు ఇండస్ట్రీలోని ప్రజలు షాక్ అయ్యారు. మేం విడాకులు తీసుకుంటున్నట్టు ఇద్దరు తమ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో ప్రకటించారు. ఇక అప్పటి నుండి వీళ్లు మీడియాలో హాట్ టాపిక్ గా మారారు.

అసలు వీళ్ళు ఎందుకు విడిపోయారు..?? అనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతుంది. కొదరు ఏమో సినిమాలని..మరి కొందరు ఏమో ఎఫైర్ అని..ఇంకొందరు ఏమో అమల టార్చర్ భరించలేకనే విడాకులు తీసుకుంది అంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. ఎంతో చూడ ముచ్చటైన ఈ జంటకు అస్సలు విడిపోవాల్సిన అవసరం ఏమి వచ్చింది అంటూ అనుకున్నారు. కొందరైతే విడిపోకండి ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు.

కానీ వీళ్లు మాత్రం విడాకుల మ్యాటర్ నుండి వెనకు తగ్గడలేదు. రీజన్ ఏంటో తెలియదు కానీ మొత్తాని తమ నాలుగేళ్ల వివాహ బంధానికి ఎండ్ కార్డ్ పెట్టేయడానికి ఫిక్స్ అయిపోయారు. దీంతో సమంత నాగ చైతన్య మాజీ మొగుడు పెళ్లాలు కాబోతున్నారు. ఇక ఈ విషయంలో పెద్ద దిక్కు నాగార్జున సైతం ఏం చేయ లేక చేతులు ఎత్తేశారు అన్న టాక్ వినిపిస్తుంది. అయితే విడాకుల తరువాత సమంత జోరు పెంచింది. వరుస సినిమాలకు కమిట్ అవుతూ..మరో నాలుగేళ్లు బిజీ గా కాల్ షీట్లు నింపుకుంది.

నేటి సినీ తారల్లో సమంత ఎంతో ప్రత్యేకం అని చెప్పాలి. ఓవైపు సినిమాలు, మరోవైపు వ్యాపారం, సామాజిక సేవ చేస్తూ ముందుకు వెళుతున్నారు. సమంతా కొంతకాలం కిందట సాకీ పేరుతో ఆన్ లైన్ వస్త్ర వ్యాపారం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఫ్యాషన్‌ రంగంలో తనదైన స్పెషాలిటీతో రెండేళ్ల క్రితం తన ఫ్రెండ్‌ సుశృతి క్రిష్ణతో కలిసి సాకీ(శాకి) పేరుతో ఉమెన్స్ వేర్‌ని ప్రారంభించింది. తన ప్రొడక్ట్ లకు తనే బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారి ప్రమోట్‌ చేసింది సమంత. అయితే రెండేళ్ల తర్వాత దీన్ని విస్తరించబోతుంది. అప్పుడు టీనేజ్‌, అడల్ట్స్, ఉమెన్స్ కి ఉండగా, ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా విస్తరిస్తుంది.

కొత్త ఏడాది సంక్రాంతి త‌ర్వాత న‌టి స‌మంత పిల్ల‌ల‌కోసం కొత్త దుస్తులను ప్రారంభించింది. సాకి అనేది స‌మంత ఓన్ బ్రాండ్‌. 2 సంవ‌త్స‌రాల నుంచి 8 సంవ‌త్స‌రాల పిల్ల‌ల‌కు ఆమె త‌యారుచేసిన ప్ర‌త్యేక దుస్తుల‌ను శ‌నివారంనాడు మార్కెట్‌లో ప్ర‌వేశ‌పెట్టింది. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సరే సమంత మాత్రం బిజినెస్ విషయంలో కాంప్రమైజ్ అవకుండా దాన్ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లాలని చూస్తుంది.

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news