వెండితెరపై బాహుబలికి ఎలాంటి క్రేజ్ ఉందో బుల్లితెరపై కార్తీకదీపం సీరియల్‌కు కూడా అంతే క్రేజ్ ఉంది. మహామహా ప్రోగ్రామ్స్, సినిమాలు, సీరియల్స్, బిగ్‌బాస్‌లు, మీలో ఎవరు కోటీశ్వరుడు లాంటి ప్రోగ్రామ్స్ వచ్చినా కూడా కార్తీకదీపం సీరియల్‌ను గత కొన్నేళ్లుగా టచ్ చేయలేకపోయాయి. ఇంకా చెప్పాలంటే అసలు ఈ సీరియల్ దరిదాపుల్లోకి కూడా రాలేకపోయాయి. అసలు కార్తీకదీపం రేటింగ్‌ను టచ్ చేసే సత్తా ఏ సీరియల్‌కు, ప్రోగ్రామ్‌కు లేదన్న ధీమాతో ఆ సీరియల్ యూనిట్ ఉండేది. అసలు చాలా మంది విశ్లేషకులు, ఎంటర్టైన్‌మెంట్ మేథావులు సైతం ఈ సీరియల్ రేటింగ్‌ను అందుకోలేరని తేల్చేశారు.
వంటలక్క, డాక్టర్ బాబు పాత్రల మత్తులో తెలుగు బుల్లితెర ప్రేక్షకులు మునిగి తేలుతున్నారు. జాతీయ స్థాయిలోనే ఈ సీరియల్ పాపులర్ అవ్వడంతో పాటు తనకు తానే తోపు అని ఫ్రూవ్ చేసుకుంది. అలాంటిది ఇప్పుడు లెక్కలు మారిపోతున్నాయ్. కార్తీకదీపం పరమసోది సీరియల్‌గా మారిపోయింది. ఒకప్పుడు తెలుగు గడ్డపై అమ్మలక్కల నోట్లో ఎవరి నోట విన్నా కూడా కార్తీకదీపం సీరియల్ గురించే చర్చ నడిచేది. ఆహో, ఓహో అని పొగిడేవారు. అసలు ఆ సీరియల్ చూడకపోతే ఏదో కోల్పోయాం అని ఫీల్ అయ్యేవారు.
ఎప్పుడు అయితే మోనిత ప్రెగ్నెంట్ ట్విస్ట్ తెరమీదకు వచ్చిందో అప్పటి నుంచి కార్తీకదీపం కథ ట్రాక్ తప్పేసింది. అప్పటి నుంచి కథనం మారిపోయి.. బోరింగ్ సీరియల్ అయిపోయింది. అప్పటి వరకు డాక్టర్ బాబు, దీప ఎప్పుడు కలుస్తారా ? అని ఎదురు చూసిన జనాలు ఈ సాగదీత చూసి తలలు బాదుకుంటున్నారు. ఈ ఎఫెక్ట్ రేటింగ్‌పై పడింది. కార్తీకదీపం సీరియల్‌కు ఇప్పటి వరకు 16 – 20 మధ్యలో రేటింగ్ ఉండేది. మిగిలిన సీరియల్స్ రేటింగ్ 11- 14 మధ్యలో ఉండేది.
అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. ఇప్పుడు కార్తీకదీపం రేటింగ్‌ను గృహలక్ష్మి సీరియల్ రేటింగ్ బీట్ చేసేసింది. అంతేకాదు గుప్పెడంత మనసు – దేవత సీరియల్స్ కూడా కార్తీకదీపాన్ని క్రాస్ చేసేశాయి. ఇక ఇప్పటకి అయినా కార్తీకదీపంకు సీరియల్‌ను ముగించకపోతే ఆ సీరియల్‌కు ఇప్పటి వరకు ఉన్న పేరు కూడా పోయేలా ఉంది.