టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది స్టార్ హీరో అయిన రవితేజ తల్లిపై కేసు నమోదు కావడం మీడియాలో చర్చనీయాంశంగా మారింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో రవితేజ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు.. ఎప్పుడు వివాదాలకి దూరంగా నే ఉంటాడు.. కాని తాజాగా తన తల్లి పై ఒక కేసు వ్యవహారం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారుతోంది. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన జగ్గంపేట మండలంలోని రామవరం వద్ద పుష్కర కాలువ ధ్వంసమైంది.. దీంతో రవితేజ తల్లి భూపతి రాజ్యలక్ష్మి మరియు మర్రిపాకకు చెందిన సంజయ్ ల పై పోలీస్ కేసు నమోదు జరిగినట్లు సమాచారం.
పూర్తి వివరాల్లోకి వెళ్లితే.. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం వద్ద పుష్కర కాలువను ధ్వంసం చేసిన కేసులో రవితేజ తల్లి భూపతి రాజ్యలక్ష్మితో పాటు మర్రిపాకకు చెందిన సంజయ్‌లపై కేసు నమోదైంది. సర్వే నెంబర్ 108,124 లో ఉన్న పుష్కర కాలువ అక్రమంగా కూల్చివేసిన కేసులో వీరిపై కేసు నమోదైనట్లు గా సమాచారం. ప్రభుత్వ ఆస్తులను అధికారుల అనుమతి లేకుండా ధ్వంసం చేసినందుకే కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. అయితే, తల్లి పై ఇలాంటి కేసు పెట్టడం పట్ల రవితేజ ఎలా రియాక్ట్ అవుతాడనేది ఆసక్తికరంగా మారింది.
ఇక ప్రస్తుతం జరిగే పరిణామాలు చూస్తుంటే రవితేజ టైం అస్సలు బాగోలేదు అన్నట్లు అనిపిస్తుంది. వివాదాలకు ఎప్పుడూ ఆమడ దూరంలో ఉండే రవితేజ పై ఈ మధ్య కాలంలో తరచూ ఏదో ఒక వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఇక్కడ అర్ధం కానీ విషయం ఏమిటంటే నిజంగా అయాన తప్పు చేసి వార్తల్లో నిలుస్తున్నారా..?లేక ఎవరైనా కావాలనే ఆయన పై పగబట్టి ఇలా అనవసరంగా మీడియాలోకి తనని లాగుతున్నారా అని అనుమానులు వ్యక్తమౌతున్నాయి. గత కొద్ది రోజుల క్రిందట డ్రగ్స్ కేసు వ్యవహారంలో కూడా రవితేజ కి ఇబ్బంది కలిగించిన విషయం మనం చూశాం.
అయితే ఆ కేసు నుండి సేఫ్ గా బయటపడ్డారు రవితేజ. ఇక ఈ మధ్యనే బాలకృష్ణ షోలో రవితేజ మాట్లాడిన మాటలు ఇప్పటికీ వైరల్ గా నే ఉన్నాయి. ప్రస్తుతం రవితేజ వరుసపెట్టి సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉన్నాడు. ఇలాంటి టైంలో ఆయన పై ఇలాంటి వార్తలు రావడం అభిమానులు జీర్నించుకోలేకపోతున్నారు. దీంతో కొందరు అభిమానులు ఏంటి రా బాబు ఇప్పుడిప్పుడే సక్సెస్ ట్రాక్ లోకి వస్తున్న రవితే పై ఇలాంటి బురద జల్లుతున్నారు అంటూ కామెంట్స్ రూపంలో వాళ్ల బాధను వ్యక్తం చేస్తున్నారు.