యువరత్న నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా తెరకెక్కిన సినిమా అఖండ. యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలయ్య – బోయపాటి కాంబినేషన్ అంటే ఎలాంటి అంచనాలు ఉంటాయో ? ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా అఖండ సూపర్ డూపర్ హిట్ అయ్యింది.
బాలయ్య – బోయపాటిది హ్యాట్రిక్ కాంబినేషన్ అని ఫ్రూవ్ చేసుకుంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత అసలు థియేటర్లకు వచ్చి జనాలు సినిమాలు చూస్తారా ? పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ చేస్తే అసలు కలెక్షన్లు వస్తాయా ? అన్న సందేహాలను అఖండ పటాపంచలు చేయడంతో పాటు పెద్ద సినిమాలకు చక్కని దారి చూపించింది. బాలయ్య కెరీర్‌లోనే ఫస్ట్ రు. 100 కోట్లు, ఫస్ట్ రు. 150 కోట్ల సినిమాగా రికార్డులకు ఎక్కిన అఖండ లాంగ్ రన్ కంటిన్యూ చేయడంతో పాటు 50 సెంటర్ల విషయంలో కూడా రికార్డు నెలకొల్పింది.
ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏ సినిమా అయినా 50 రోజులు ఆడాలంటే గొప్ప విషయమే. అయితే అఖండ ఏకంగా 106 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకుంది. అఖండ బాక్సాఫీస్ దగ్గర అఖండ జ్యోతిలా వెలుగుతూనే ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అఖండ ఏకంగా 106 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకుంది. అఖండ తర్వాత పుష్ప వచ్చింది.. వెళ్లింది.
మరోవైపు నాని శ్యామ్‌సింగరాయ్‌తో పాటు సంక్రాంతికి నాగార్జున బంగార్రాజుతో పాటు మరో రెండు సినిమాలు వచ్చాయి. ఎన్ని సినిమాలు వచ్చినా కూడా బాక్సాఫీస్ దగ్గర అఖండ జాతర మాత్రం ఆగలేదు. ఏదేమైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో అఖండ 106 కేంద్రాల్లో 50 రోజులు ఆడడం అంటే మామూలు రికార్డు కాదు. బాలయ్య మాస్ జాతర తెలుగు గడ్డను ఊపేసిందనే చెప్పాలి. ఇక బాలయ్య అభిమానులు ఎక్కడికక్కడ ఈ సినిమా అర్ధశతదినోత్సవ విజయోత్సవాలు జరుపుకునేందుకు రెడీ అవుతున్నారు.