ఒక హీరో, హీరోయిన్ కలిసి ఒకటి రెండు సినిమాలు చేస్తే చాలు. వారిద్దరి మధ్య ఏదో ఉందనే గాసిప్‌లు రావడం ఇండస్ట్రీలో కామన్. ఎన్నో యేళ్ల నుంచి ఈ పుకార్లు కూడా మనం వింటూనే ఉన్నాం. ఈ క్రమంలోనే సీనియర్ హీరోయిన్ మహేశ్వరి విషయంలో కూడా ఓ హీరోతో ఎఫైర్ ఉందన్న పుకార్లు అప్పట్లో వినిపించాయి. సదరు హీరోతో ఆమె రెండు సినిమాలు చేసిందో లేదో వారిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ ఉందన్న ప్రచారం ఎక్కువుగా నడిచింది.
కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన గులాబీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మహేశ్వరి హీరోయిన్గా పరిచయం అయ్యింది. ఆమె ఎవరో కాదు అతిలోక సుందరి శ్రీదేవికి కజిన్. శ్రీదేవి కజిన్ కావడంతో ఆ బ్రాండ్‌ను వాడుకుని ఆమె కెరీర్ స్టార్టింగ్‌లో మంచి అవకాశాలే దక్కించుకుంది. మొదటి సినిమాతో మంచి పేరు రావడంతో ఆ తర్వాత ఆమె వరుసగా నీ కోసం – మా బాలాజీ – పెళ్లి – మా అన్నయ్య – తిరుమల తిరుపతి వెంకటేశ – సినిమాల్లో నటించి ప్రేక్షకుల మదిలో నిలిచింది.
ఆ తర్వాత పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం అయిన ఆమె తాజాగా ఆలీతో సరదాగా షోకు వచ్చింది. ఈ క్రమంలోనే తన సినిమా జీవితంతో పాటు పర్సనల్ జీవితానికి సంబంధించి ఆసక్తికర విషయాలు చెప్పింది. శ్రీదేవి ఫ్యామిలీ నుంచి రావడంతో తనకు చాలా పొగరు అన్న ప్రచారం జరిగింది అని.. తాను స్వతహాగా చాలా కూల్‌గా ఉంటానని చెప్పింది. ఇక శ్రీదేవితో తనకు ఉన్న రిలేషన్ కూడా చెప్పింది. శ్రీదేవి తనకు పిన్ని అవుతుందని ఆమె తెలిపింది.
ఇక వడ్డే నవీన్‌కు, మహేశ్వరికి మధ్య ఏదో ఉందన్న ప్రచారం గురించి ఆమె నవ్వేసింది. నవీన్ సెట్స్‌లో కూడా పెద్దగా మాట్లాడడు అని.. చాలా సైలెంట్‌గా ఉంటాడని.. మా ఇద్దరి మధ్య గుడ్ మార్నింగ్, గుడ్ ఈవెనింగ్ తప్ప మరో మాట ఉండేది కాదని చెప్పింది. అయితే మా ఇద్దరి మధ్య ఏదో ఉందని చాలా వార్తలు విన్నానని నవ్వుతూ చెప్పింది. మహేశ్వరి 2008లో సాఫ్ట్వేర్ జయకృష్ణను పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది.