టాలీవుడ్ సీనియర్ నాగార్జునకు నిన్నే పెళ్లాడతా సినిమా నుంచి రొమాంటిక్ ఇమేజ్ వచ్చింది. అయితే కె. విజయ్‌భాస్కర్ దర్శకత్వంలో నాగార్జున చేసిన మన్మధుడు సినిమా సూపర్ హిట్ అయ్యి నాగార్జునకు కెరీర్ చివరి వరకు తిరుగులేని మన్మధుడిని చేసేసింది. నాగార్జున ఆ తర్వాత ఎన్ని సినిమాలు చేసినా.. ఇంత వయస్సు వచ్చినా ఇప్పటకీ అదే మన్మధుడు ఇమేజ్ కంటిన్యూ అవుతోంది. ఇక ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడానికి ముందు చాలా ఆసక్తికర విషయాలు ఉన్నాయి.
వరుస ప్లాపులతో ఉన్న నాగార్జున చాలా సినిమాల తర్వాత 2002 సమ్మర్‌లో దశరథ్ దర్శకత్వంలో వచ్చిన సంతోషం సినిమాతో హిట్ కొట్టాడు. ఈ సినిమా నాగార్జునకు ఊరట ఇచ్చింది. ఆ తర్వాత మన్మధుడు సినిమా కథను దర్శకుడు విజయ్‌భాస్కర్ నాగార్జునకు వినిపించారు. ఈ సినిమాకు ముందు విజయ్ భాస్కర్ విక్టరీ వెంకటేష్‌తో నువ్వునాకు నచ్చావ్ లాంటి సూపర్ హిట్ సినిమా చేసి మంచి ఫామ్‌లో ఉన్నాడు.
అయితే నాగార్జునతో చేసే సినిమాకు ముందుగా అనుకున్న కథ వేరు.. అయితే ఈ సినిమాపై డిస్కర్షన్లు నడుస్తున్నప్పుడు కథను కొంత వరకు నాగార్జున ఇమేజ్‌కు అనుగుణంగా మార్చారు. ఈ సినిమాను నిర్మించేందుకు చాలా మంది నిర్మాతలు ముందుకు వచ్చినా కథ నచ్చడంతో నాగార్జున స్వయంగా తన అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మించాడు.
ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందించారు. త్రివిక్రమ్ మాటలకు మెస్మరైజ్ అయిన నాగార్జున… ఆ రోజుల్లోనే త్రివిక్రమ్ ఊహించని విధంగా కోటి రూపాయలను కేవలం త్రివికమ్‌కు రెమ్యునరేషన్‌గా ఇచ్చారు. ముందుగా ఆర్తీ అర్వాల్‌ను ఓ హీరోయిన్‌గా తీసుకోవాలని అనుకున్నారు. కొత్త హీరోయిన్‌ను ప్రేక్షకులకు పరిచయం చేస్తే సినిమాకు ప్రెష్ ఫీల్ ఉంటుందని దర్శకుడు విజయ్ భాస్కర్ భావించారు.
ఆయన అంతకు ముందు డైరెక్ట్ చేసిన నువ్వునాకు నచ్చావ్ సినిమాతో ఆర్తీ అగర్వాల్ హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. ఆర్తీ ఆ సినిమా విజయంలో చాలా ప్లస్ అయ్యింది. అందుకు మన్మధుడు సినిమాకు కూడా కొత్త హీరోయిన్లు కావాలని ఆయన పట్టుబట్టారు. ఓ పాత్రకు బాలీవుడ్ అందాల సుందరి సోనాలిబింద్రేను తీసుకున్నారు. ఆమె అప్పటికే తెలుగులో మురారి, ఖడ్గం సినిమాలు చేసింది.
ఇక మరో హీరోయిన్‌కు కొత్త అమ్మాయి అన్షును తీసుకున్నారు. ఈ సినిమా విజయంలో వీరిద్దరు చాలా అంటే చాలా ప్లస్ అయ్యారు. ఇక డిసెంబర్ 20, 2002లో రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ రోజుల్లోనే భారీ షేర్ రాబట్టడంతో పాటు 26 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. క్లాస్ సెంటర్లలో ఈ సినిమాను విపరీతంగా ఎంజాయ్ చేశారు. దేవిశ్రీ ప్రసాద్ పాటలు అదిరిపోయాయి.
అందమైన భామలు లేత మొరుపు తీగలు పాట ఇప్పటకీ కొత్తగా ఉంటుంది. ఆ రోజుల్లో ఈ సినిమా రు. 10 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసింది. నాగార్జునకు మంచి పేరు తీసుకు రావడంతో పాటు నిర్మాతగాను లాభాలు తెచ్చిపెట్టింది. ఈ సినిమా రిలీజ్ రోజునే సచిన్, భావన నటించిన నినుచూడక నేనుండలేను సినిమా రిలీజ్ అయ్యి ప్లాప్ అయ్యింది. ఇక డిసెంబర్ 27న మాస్ మహరాజ్ రవితేజ అన్వేషణ వచ్చినా అది కూడా ప్లాప్ అయ్యింది.