యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు నేషనల్ స్టార్ అయిపోయాడు. బాహుబలి 1, 2 సినిమాల తర్వాత ప్రభాస్‌కు ఒక్కసారిగా నేషనల్ క్రేజ్ వచ్చేసింది. ఆ క్రేజ్‌తోనే కేవలం ఒక్క సినిమాకు మాత్రమే దర్శకత్వం వహించిన సుజీత్ డైరెక్షన్‌లో సాహో సినిమా చేశాడు. రు. 300 కోట్ల పై చిలుకు భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సాహో టాలీవుడ్‌లో ఓ విధంగా ప్లాప్ అయ్యినట్టే లెక్క. ఇక్కడ ఆ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్‌కు వసూళ్లతో పోల్చి చూస్తే నష్టాలే వచ్చాయి. అయితే ట్విస్ట్ ఏంటంటే ఈ సినిమా నార్త్‌లో అనూహ్య వసూళ్లు సొంతం చేసుకుంది.
బాహుబలి క్రేజ్ అక్కడ సాహో హిట్ అవ్వడానికి బాగా యూజ్ అయ్యింది. ఇక ఇప్పుడు ప్రభాస్ వరుస పెట్టి పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నాడు. ప్రభాస్ సినిమాల లైనప్ చూస్తే అవన్నీ రు. 1500 నుంచి రు. 2 వేల కోట్ల వసూళ్లు రాబట్టే రేంజ్‌లోనే ఉన్నాయి. ఆదిపురుష్ కావచ్చు, రాధేశ్యామ్, సలార్ ఈ సినిమాలు అన్నీ భారీ బడ్జెట్‌తో వస్తున్నవే. వీటికి తోడు వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ నిర్మించే భారీ బడ్జెట్ సినిమా ప్రాజెక్ట్ కె కూడా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది.
మహానటి సినిమా తర్వాత దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ ప్రాజెక్టు మీదే వర్క్ చేస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అశ్వనీదత్ మాట్లాడుతూ ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా షూటింగ్‌ను కంటిన్యూగా చేసి ఈ యేడాది చివరకు షూటింగ్ పూర్తి చేస్తామని చెప్పారు. ఇక పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసి మే 2023లో ప్రాజెక్ట్ కెను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలనుకుంటున్నట్టు ఆయన చెప్పారు.
అయితే ఇదంతా పరిస్థితులు మామూలుగా ఉంటేనే సాధ్యం అవుతుంది. ప్రస్తుతం ఒమిక్రాన్ వైరస్ విస్తరణ నేపథ్యంలో అన్ని సినిమాల షూటింగ్‌లు ఆగిపోతున్నాయి. మరి ప్రాజెక్టు కె షూటింగ్ కంటిన్యూగా జరిగితేనే అనుకున్న డేట్‌కు రిలీజ్ కానుంది.