ఆచార్య సినిమాపై మరో డిజప్పాయింట్ న్యూస్ బయటకు వచ్చింది. కొరటాల శివ సినిమా భరత్ అనే నేను వచ్చి నాలుగేళ్లు దాటుతోంది. సైరా వచ్చి రెండున్నర సంవత్సరాలు దాటుతోంది. వీరిద్దరి కాంబోలో తెరకెక్కిన ఆచార్య సినిమా ఇప్పటికే ఎన్నో డేట్లు మారి వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఫిబ్రవరి ఫ్ట్ వీక్‌కు రిలీజ్ డేట్ ఎనౌన్స్ అయ్యింది. అయితే ఇప్పుడు ఆ డేట్‌కు రిలీజ్ అయ్యే ఛాన్సులు లేవు.
సంక్రాంతికి రావాల్సిన సినిమాలు వరుసగా వాయిదాలు పడుతూ వస్తున్నాయి. ట్రిఫుల్ ఆర్ సమ్మర్‌కు అంటున్నారు. రాధేశ్యామ్ కూడా ఏప్రిల్‌లో ఉండొచ్చు. ఇక ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌లో రావాల్సిన ఆచార్య ఇప్పుడు కోవిడ్ నేపథ్యంలో రీషూట్లు జరగడంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా గట్టిగా మరో నెల రోజుల పాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయి.
ఇక కొరటాల కూడా ఫిబ్రవరిలో ముందుగా అనుకున్న డేట్‌కు రిలీజ్ చేసేందుకు ఒప్పుకోవడం లేదట.
ఇక సమ్మర్‌కు ట్రిపుల్ ఆర్, రాధేశ్యామ్, భీమ్లానాయక్, ఎఫ్ 3 ఇంకా పెద్ద సినిమాలు చాలానే ఉన్నాయి. ఇవి అయ్యాక రావాలంటే ఏ మేలోనో లేదా జూన్కో వెళ్లిపోవాలి. ఎందుకంటే ఫిబ్రవరి, మార్చి నెలల్లో సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశాలు లేవు.
ఏ మార్చిలోనో లేదా ఏప్రిల్‌లోనే పెద్ద సినిమాల రిలీజ్లు అంటే ముందుగా షెడ్యూల్ అయిన సినిమాల తర్వాత రావాలి. అంటే జూన్, జూలైకు సినిమా వెళ్లిపోతుంది. అంటే మరో ఆరు నెలలు ఆగాల్సి ఉంది. ఇది మెగా అభిమానులకు పెద్ద బ్యాడ్ న్యూసే అని చెప్పాలి.